ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లతో రెనాల్ట్ లేటెస్ట్ క్విడ్.. అదిరిపోయే మైలేజ్, కళ్ళుచెదిరే ధర..

Ashok Kumar   | Asianet News
Published : Mar 15, 2022, 10:15 AM IST
ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లతో రెనాల్ట్ లేటెస్ట్ క్విడ్.. అదిరిపోయే మైలేజ్,  కళ్ళుచెదిరే ధర..

సారాంశం

రెనాల్ట్ క్విడ్ MY22 0.8-లీటర్ అండ్ 1.0-లీటర్ SCe పవర్‌ట్రైన్ ఆప్షన్ లో మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్ కొత్త అధునాతన ఫీచర్లతో అప్‌డేట్ చేయబడిన ఇంటీరియర్‌లను పొందుతుంది.  

 ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఆటోమోబైల్ తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా (Renault India) ఇండియాలో సరికొత్త క్విడ్ ఎం‌వై22 (Kwid MY22)ని రూ. 4.49 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. రెనాల్ట్ క్విడ్ MY22 0.8-లీటర్ అండ్ 1.0-లీటర్ SCe పవర్‌ట్రైన్ ఆప్షన్ లో మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్ కొత్త అధునాతన ఫీచర్లతో అప్‌డేట్ చేయబడిన ఇంటీరియర్‌లను పొందుతుంది.  

ఇంజిన్ అండ్ మైలేజీ
 2015లో దేశంలో తొలిసారిగా విడుదలైన రెనాల్ట్ క్విడ్ ఇప్పటివరకు 4,00,000 యూనిట్లకు పైగా విక్రయించింది. కొత్త Kwid MY22 శ్రేణి RXL (O) వేరియంట్‌లో 0.8-లీటర్, 1.0-లీటర్ MT పవర్‌ట్రెయిన్ ఇంజన్ ఆప్షన్స్ తో పరిచయం చేసింది. ఈ మోడల్ లైన్ సిల్వర్ స్ట్రీక్ LED DRLలను పొందుతుంది, ఇంకా కారుకు ప్రీమియం అప్పీల్‌ని ఇస్తుంది. రెనాల్ట్ క్విడ్ 0.8-లీటర్ వేరియంట్ ARAI టెస్టింగ్ సర్టిఫికేషన్ ప్రకారం 22.25 kmpl మైలేజీని ఇస్తుంది. 

కారు లోపలి భాగాల గురించి మాట్లాడితే కొత్త మోడల్ MediaNAV Evolution, Android Auto, Apple CarPlay, వీడియో ప్లేబ్యాక్, వాయిస్ రికగ్నిషన్ ఫీచర్‌లతో కూడిన 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్‌లను పొందుతుంది . మార్గదర్శకాలతో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి  క్లాస్ ఫీచర్‌లో  మొదటిది. దీనితో పాటు, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ORVMలు కూడా ఇందులో ఇచ్చారు. 

సేఫ్టీ ఫీచర్లు
కొత్త మోడల్ భారతీయ మార్కెట్‌కు ప్రస్తుతం ఉన్న అన్ని భద్రతా అవసరాలను అనుసరిస్తుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, సీట్ బెల్ట్ రిమైండర్, ఓవర్‌స్పీడ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, డ్రైవర్ సైడ్ పైరో  ఇంకా లోడ్ లిమిటర్‌తో కూడిన ప్రీ-టెన్షనర్ వంటి యాక్టివ్ అండ్ పాసివ్ సేఫ్టీ ఫీచర్‌లతో కూడా వస్తుంది. ఇవి అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటాయి. 

కలర్ ఆప్షన్స్ 
రెనాల్ట్ క్విడ్ MY22 క్లైంబర్  కలర్ ఆప్షన్స్ లో మెటల్ మస్టర్డ్ అండ్ బ్లాక్ రూఫ్‌తో డ్యూయల్ టోన్‌లో ఐస్ కూల్ వైట్ ఉన్నాయి. ఇందులో కొత్త డ్యూయల్ టోన్ ఫ్లెక్స్ వీల్స్ ఉన్నాయి. సింగిల్ టోన్‌ కలర్ ఆప్షన్‌లో మూన్‌లైట్ సిల్వర్ అండ్ జన్స్కార్ బ్లూ వంటి కలర్స్ ఉన్నాయి. 

నిర్వహణ ఖర్చు కి.మీకి 35 పైసలు 
మోడల్ లైన్ నిర్వహణ ఖర్చు కి.మీకి 35 పైసల కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అదనంగా, రెనాల్ట్ రెండు సంవత్సరాలు లేదా 50,000 కి.మీల వరకు  మ్యానుఫట్చర్ వారెంటీని అందిస్తుంది, ఏది ముందుగా ఉంటే అది ఐదేళ్ల వరకు ఎక్స్ టెంటెడ్ ఆప్షన్ అండ్ నిర్వహణ అవసరాల కోసం సులభమైన-కేర్ ప్యాకేజీతో వస్తుంది. వారంటీ ప్లాన్ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 24X7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ (RSA)తో వస్తుంది. 

పెరుగుతున్న నెట్‌వర్క్
సంస్థ గత రెండేళ్లలో 150 కంటే ఎక్కువ సౌకర్యాలను  అందించడం ద్వారా దేశంలో  దాని నెట్‌వర్క్ పరిధిని విస్తరిస్తోంది. ప్రస్తుతం, బ్రాండ్ 530 సేల్స్ అండ్ 530 కంటే పైగా సర్వీస్ టచ్‌పాయింట్‌లు ఉన్నాయి. ఇందులో దేశవ్యాప్తంగా 250కి పైగా వర్క్‌షాప్ ఆన్ వీల్స్ (WOW), WOWLite లొకేషన్స్ ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

తక్కువ ధర, ఎక్కువ మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లతో చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారు
తక్కువ ధరలో అద్భుత ఫీచర్లతో యమహా కొత్త బైక్‌లు లాంచ్