Cars Under 7 Lakhs:కొత్త కారు కొనాలని చూస్తున్నారా, మీ బడ్జెట్ పరిధిలోనే కాంపాక్ట్ SUV కొనాలని చూస్తున్నారా, అయితే మంచి మైలేజీతో పాటు కేవలం 7 లక్షల బడ్జెట్ లోపే లభించే టాప్ 5 మోడల్ కార్లు మీ కోసం..
Cars Under 7 Lakhs: బడ్జెట్ కార్లకు భారత్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం కార్ల కన్నా కూడా బడ్జెట్ ధరలో లభించే కార్లను కొనేందుకు భారతీయ కస్టమర్లు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరకే 7 లక్షల లోపు లభించే కాంపాక్ట్ SUV కార్ల గురించి తెలుసుకుందాం. కాంపాక్ట్ SUV లేదా హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని ఆలోచిస్తున్నారా, మీ బడ్జెట్ రూ. 7 లక్షల వరకు మాత్రమే ఉందా, అయితే మీ గందరగోళాన్ని తొలగించేలా టాప్ 5 మోడల్ కార్లను మీ ముందు ఉంచాము. వాటి పీచర్లు, అలాగే ధరలను తెలుసుకోండి.
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)
ముందుగా, ఈ కాంపాక్ట్ SUV కారు ధర రూ. 6.99 లక్షల నుండి రూ. 11.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ SUV మొత్తం 18 వేరియంట్లలో వస్తుంది. ఇది రెండు పెట్రోల్, డీజిల్ ఇంజన్ వేరియంట్స్ లో లభిస్తోంది. దీనితో పాటు, మాన్యువల్, క్లచ్‌లెస్ మాన్యువల్ ఆటోమేటిక్ (డ్యూయల్ క్లచ్)లో మూడు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే, దీని మైలేజ్ 17.52 kmpl నుండి 23.4 kmpl వరకు ఉంటుంది.
undefined
టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)
టాటా మోటార్స్ కు చెందిన ఈ హ్యాచ్‌బ్యాక్ కారు ధర భారతీయ మార్కెట్‌లో రూ. 5.99 లక్షల నుండి రూ. 9.70 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ఈ కారు మొత్తం 20 వేరియంట్లలో వస్తుంది. ఇది డీజిల్, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. దీని ఇంజిన్ మాన్యువల్ గా లభిస్తోంది. - దీని మైలేజ్ 19.05 kmpl నుండి 25.11 kmpl వరకు ఉంటుంది.
హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)
ఈ హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ. 6.98 లక్షల నుండి రూ. 11.47 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో వస్తుంది. దీని మొత్తం 24 వేరియంట్లలో వస్తుంది. ఈ కారు 2 పెట్రోల్, ఒక డీజిల్ ఆప్షన్‌తో వస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం ఇంజిన్ ఎంపికలు మాన్యువల్, ఆటోమేటిక్ (CVT), క్లచ్‌లెస్ మాన్యువల్, ఆటోమేటిక్ (డ్యూయల్ క్లచ్). దీని మైలేజ్ 19.65 kmpl, 25.2 kmpl వరకు ఉంటుంది.
కియా సోనెట్ (Kia Sonet)
ప్రముఖ అంతర్జాతీయ ఆటో దిగ్గజ కంపెనీ కియా నుంచి వచ్చి సోనెట్ కారు, మార్కెట్లో రూ. 6.95 లక్షల నుండి రూ. 13.68 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో వస్తుంది. ఇది మొత్తం 27 వేరియంట్లలో వస్తుంది. ఇది 2 పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో లభిస్తోంద. ట్రాన్స్‌మిషన్ కోసం ఇంజిన్ మాన్యువల్, క్లచ్‌లెస్ మాన్యువల్, ఆటోమేటిక్ (డ్యూయల్ క్లచ్), ఆటోమేటిక్ (టార్క్ కన్వర్టర్)తో వస్తుంది. దీని మైలేజ్ 18.2 kmpl నుండి 24.1 kmpl వరకు ఉంటుంది.