ఇప్పుడు కస్టమర్లను ఆకర్శించేందుకు మహీంద్రా నవంబర్ నెలలో మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ300, మరాజ్జో, బొలెరో వంటి మోడళ్ల కొనుగోలుపై రూ.68,000 వరకు తగ్గింపును ప్రకటించింది.
దేశీయ సంస్థ, ఇండియాలోని పాపులర్ ఎస్‌యూవి వాహన తయారీ కంపెనీ మహీంద్రా అక్టోబర్ నెలలో 60.45 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ కొంతకాలం క్రితం మహీంద్రా స్కార్పియో-ఎన్, మహీంద్రా స్కార్పియో కొత్త మోడళ్లను కూడా లాంచ్ చేసిన సంగతీ మీకు తెలిసిందే. దీంతో కంపెనీ ఇండియాలో సేల్స్ మరింత పెంచుకోవాలని భావిస్తోంది.
ఇప్పుడు కస్టమర్లను ఆకర్శించేందుకు మహీంద్రా నవంబర్ నెలలో మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ300, మరాజ్జో, బొలెరో వంటి మోడళ్ల కొనుగోలుపై రూ.68,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బెనెఫిట్స్ ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్లు మహీంద్రా స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్, థార్ వంటి మోడల్‌పై లేవు.
undefined
మహీంద్రా ఎక్స్‌యూవి300
మహీంద్రా ఎక్స్‌యూవి300 పై అత్యధికంగా రూ. 68,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఎస్‌యూవి పెట్రోల్ వేరియంట్ పై రూ. 29,000 వరకు క్యాష్ డిస్కౌంట్, డీజిల్ వేరియంట్‌పై రూ.23,000 వరకు డిస్కౌంట్ ఉండగా, రూ. 25,000 ఎక్స్చేంజ్ బెనెఫిట్స్, రూ. 10,000 విలువైన యాక్సెసరిస్, సెలెక్ట్ చేసిన వేరియంట్‌లపై రూ. 4,000 కార్పొరేట్ బోనస్‌ను పొందవచ్చు. కంపెనీ ఈ ఆఫర్‌ల నుండి ఎక్స్‌యూవి300 TurboSportని మినహాయించడం గమనార్హం.
మహీంద్రా మరాజో
మహీంద్రా మరాజో ఎమ్‌పివిపై ఇప్పుడు రూ. 40,200 వరకు డిస్కౌంట్ ఆఫర్‌తో లభిస్తుంది. ఈ ఆఫర్‌లలో బేస్ వేరియంట్‌పై రూ. 20,000 క్యాష్ తగ్గింపు, M4 అండ్ M6 వేరియంట్‌లపై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, అదనంగా MPVపై రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనెఫిట్స్ ఉన్నాయి, అన్ని ట్రిమ్‌లపై రూ. 5,200 వరకు కార్పొరేట్ తగ్గింపుతో అందిస్తుంది.
మహీంద్రా బొలెరో
ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటైన మహీంద్రా బొలెరో పై రూ. 28,000 వరకు డిస్కౌంట్ ఇస్తుంది. ఆఫర్ కింద రూ.6,500 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ వాహనంపై రూ.8,500 విలువైన యాక్సెసరీలు కూడా ఉచితంగా లభిస్తున్నాయి.