సిఎన్‌జికి వచ్చేసరికి ఈ కారును ఇష్టపడే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ కారు ఎన్నో వేరియంట్‌లలో వచ్చినప్పటికీ సిఎన్‌జితో కంపెనీ VXi, ZXi వేరియంట్‌లను మాత్రమే అందిస్తుంది.
కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌కు భారతీయ మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సిఎన్‌జి ఫ్యుయెల్ విషయానికి వస్తే ఈ కార్లు సౌకర్యం ఇంకా సేవింగ్స్ కారణంగా కస్టమర్ల ఫస్ట్ ఆప్షన్ గా మారతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్లు, సౌకర్యంతో లభించే ఈ మూడు కార్ల గురించి మీకోసం...
డిజైర్
undefined
మారుతి డిజైర్ ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కంపెనీ తాజాగా మూడవ జనరేషన్ డిజైర్‌లో సిఎన్‌జి ఆప్షన్ ప్రవేశపెట్టింది. సిఎన్‌జికి వచ్చేసరికి ఈ కారును ఇష్టపడే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ కారు ఎన్నో వేరియంట్‌లలో వచ్చినప్పటికీ సిఎన్‌జితో కంపెనీ VXi, ZXi వేరియంట్‌లను మాత్రమే అందిస్తుంది. VXi సిఎన్‌జి వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.23 లక్షలు ఇంకా ZXi సిఎన్‌జి వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.91 లక్షలు. కంపెనీ ప్రకారం సిఎన్‌జితో ఈ కారు కిలోకు ఆవరేజ్ గా 31.12 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ కారులో సిఎన్‌జితో పాటు 37-లీటర్ పెట్రోల్ ట్యాంక్ కూడా అందించారు. ఫీచర్ల గురించి మాట్లాడితే డిజైర్‌కు ABS అండ్ EBD, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఇచ్చారు.
టాటా టిగోర్
భారతీయ కంపెనీ టాటా టిగోర్ కూడా సిఎన్‌జి ఆప్షన్ తో వస్తుంది. టిగోర్‌లో సిఎన్‌జితో మొత్తం నాలుగు వేరియంట్‌లు ఉన్నాయి. XM వేరియంట్ సిఎన్‌జి కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.39 లక్షలు కాగా, XZ- ధర రూ.7.89, XZ ప్లస్ ధర - రూ.8.49, XZ ప్లస్ DT ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.58 లక్షలు. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే మిగిలిన కార్లు పెట్రోల్‌తో స్టార్ట్ అయితే ఈ కారు నేరుగా సిఎన్‌జితో స్టార్ట్ అవుతుంది. ఈ కారులో సిఎన్‌జి పాటు 35 లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉంది. ఫీచర్లు చూస్తే డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS అండ్ EBD, పంక్చర్ రిపేర్ కిట్, రియర్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హ్యుందాయ్ ఆరా
భారతదేశంలో చాలా కాలంగా కార్లను విక్రయిస్తున్న దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ టిగోర్, డిజైర్ కంటే ముందు ఈ విభాగంలో సిఎన్‌జి వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. DZire లాగానే Aura కూడా కేవలం రెండు వేరియంట్లలో సిఎన్‌జి ఆప్షన్ పొందుతుంది. ఇందులో ఎస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.87 లక్షలు కాగా, ఎస్ ఎక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.56 లక్షలు. 1.2-లీటర్ డ్యూయల్ VTVT ఇంజిన్‌తో సెంటర్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ABS అండ్ EBD, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.