వీఐపీ నంబర్ ప్లేట్‌లు లేక ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ల మోజులో ప్రజలు అడిగినంత ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా చండీగఢ్‌లో చోటుచేసుకుంది.
వీఐపీ నంబర్ ప్లేట్‌లు లేక ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ల కోసం ప్రజలు అడిగినంత ఖర్చు చేసేందుకు అస్సలు వెనుకాడరు. అయితే అలాంటి ఘటనే చండీగఢ్‌లో చోటుచేసుకుంది. చండీగఢ్‌లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన రూ.71వేల హోండా యాక్టివా స్కూటర్‌కు వీఐపీ నంబర్ ప్లేట్ పొందడానికి ఏకంగా రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశాడు.
ఎవరు బ్రిజ్ మోహన్
మీడియా నివేదికల ప్రకారం, అడ్వటైజింగ్ వృత్తితో సంబంధం ఉన్న 42 ఏళ్ల బ్రిజ్ మోహన్ ఇటీవల చండీగఢ్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ నిర్వహించిన వేలంలో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను పొందారు. ఈ వాహనం నంబర్ CH01-CJ-0001ని కొనుగోలు చేసేందుకు రూ.15.44 లక్షలు చెల్లించాడు.
undefined
ఈ నంబర్ ఎల్లప్పుడూ యాక్టివాకి ఉండదు,
అయితే ఈ ఖరీదైన వాహన నంబర్ ప్లేట్ యాక్టివా స్కూటర్‌కి ఎప్పటికీ ఉండదు. భవిష్యత్తులో దీన్ని తన కారుకు ఉపయోగించాలని యోచిస్తున్నట్లు మోహన్ తెలిపారు. అయితే మొదట్లో ఈ నంబర్ అతని స్కూటర్‌కి కనిపిస్తుంది. "నేను ఇటీవల కొన్న నా యాక్టివాకి ఈ నంబర్‌ను ఉపయోగిస్తాను. కానీ తరువాత భవిష్యత్తులో నేను దానిని కారుకు ఉపయోగిస్తాను" అని చెప్పాడు.
ఫ్యాన్సీ నంబర్‌ల ద్వారా రూ. 1.5 కోట్లు
ఈ వేలం ప్రక్రియ ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగింది. చండీగఢ్ లైసెన్సింగ్ అథారిటీ అధికారి ప్రకారం, 378 నంబర్ ప్లేట్‌లను వేలం వేయగా, మొత్తం రూ. 1.5 కోట్లు వచ్చాయి అని తెలిపారు. రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు హర్యానా ప్రభుత్వం '0001' నంబర్ ప్లేట్‌లను వేలంలో ఉంచుతుందని ఇటీవల హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. CH01- CJ-0001ని వేలంలో పొందిన బ్రిజ్ మోహన్ ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీని నడుపుతున్నాడు.
ఫ్యాన్సీ నంబర్‌లు లక్షల్లో అమ్ముడయ్యాయి
వేలం వేసిన అన్ని నంబర్లలో మోహన్ పొందిన CH01-CJ-0001ని రూ.50,000 బేస్ ధర వద్ద వేలానికి ఉంచగా అత్యధిక మొత్తాన్ని పొందింది. రెండవ అత్యంత ఖరీదైన వేలం CH-01-CJ-002, ఈ నంబర్ రూ. 5.4 లక్షలు పలికింది. మూడవ అత్యధిక ఖరీదైన నంబర్ CH-01-CJ-007 దీనిని రూ.4.4 లక్షలకు వేలం వేయబడింది. కాగా CH-01-CJ-003 రూ. 4.2 లక్షలకు విక్రయించారు. ఈ నంబర్ల రిజర్వ్ ధర రూ.30,000.
2012లో విక్రయించిన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్
0001 నంబర్ ప్లేట్ కోసం అత్యధిక బిడ్ 2012లో జరిగింది, ఒక వాహన యజమాని దానిని CH-01-AP సిరీస్ నుండి రూ. 26.05 లక్షలకు కొనుగోలు చేశాడు. అతను తన S-క్లాస్ మెర్సిడెస్ బెంజ్ (S-class mercedes benz) కారు కోసం ఈ నంబర్‌ను కొనుగోలు చేశాడు. ఈ కారు ధర నంబర్ ప్లేట్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఇప్పటి వరకు, 0001 నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తున్న 179 రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి.