కవాసాకీ అప్‌డేటెడ్ వర్సీస్-650 బైక్

By narsimha lodeFirst Published Oct 14, 2018, 11:03 AM IST
Highlights

ప్రముఖ ద్విచక్ర వాహనాల ఉత్పత్తుల సంస్థ ఇండియా కవాసాకి మోటార్ ‌(ఐకేఎం) మరో సరికొత్త బైక్‌ను విపణిలోకి తీసుకు వచ్చింది. 

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల ఉత్పత్తుల సంస్థ ఇండియా కవాసాకి మోటార్ ‌(ఐకేఎం) మరో సరికొత్త బైక్‌ను విపణిలోకి తీసుకు వచ్చింది. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘వర్సీస్‌ -650’ 2019 ఎడిషన్‌ను విడుదల చేసింది.

దీని ధర రూ. 6.69లక్షలుగా నిర్ణయించింది. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వర్సీస్‌ 650 కూడా ఇదే ధరకు లభిస్తోంది. కొత్తగా విడుదల చేసిన 2019 ఎడిషన్‌ బైక్‌లో పెద్దగా మెకానికల్‌ మార్పులు లేకపోవడంతో ధరలో ఎలాంటి మార్పు చేయలేదని కంపెనీ తెలిపింది. 

సుజుకి వీ స్ట్రోమ్ 650 ఎక్స్ టీ, ఎస్‌డబ్ల్యూ‌ఎం సూపర్ డ్యూయల్ టీ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను భారత మార్కెట్ లో విడుదల చేసిన తర్వాత కవాసాకి తాజాగా వర్సీస్ 650 మోడల్ బైక్ ఆవిష్కరించడం గమనార్హం.

తాజా ఎడిషన్‌లో సరికొత్త రంగుల్లో బైక్‌లను విడుదల చేశారు. ఇక ఈ బైక్‌లో 649 సీసీ, ప్యార్లల్ ట్విన్‌, లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌ 67.4బీహెచ్‌పీ పవర్‌, 64ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తాజా కవాసాకి వర్సీస్ -650 మోడల్ బైక్‌కు 6-స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. 21లీటర్ల ఇంధన ట్యాంక్‌ గల ఈ బైక్‌ బరువు 216 కిలోలు. కంపెనీ షోరూంల్లో ఇప్పటికే ఈ బైక్‌ బుకింగ్‌లు ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది.

17 అంగుళాల అల్లాయ్ వీల్స్, రోడ్ స్పెక్ టైర్లపై కవాసాకి బైక్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. గమ్మత్తేమిటంటే తాజాగా ఆటోమొబైల్ రంగంలో సాంకేతిక పరిజ్నానాన్ని జోడీంచి వాహనాలను తయారు చేస్తున్నారు. కానీ కవాసాకీ తన తాజా మోడల్ వర్సీస్ - 650 మోడల్ మోటార్ బైక్ నిర్మాణానికి టెక్నాలజీని వినియోగించకుండానే తయారు చేశారు. 300 ట్విన్ డిస్క్ బ్రేక్స్, రేర్ 250 ఎంఎం సింగిల్ డిస్క్ బ్రేక్‌లు రూపొందించారు.
 

click me!