రోడ్డు పై పెరుగుతున్న ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఆటోమేటిక్ గేర్‌తో వాహనాలకు ఆదరణను విస్మరించలేము. భారతదేశంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న కారు స్పెషాలిటీ ఏమిటంటే, రోడ్డుపై ట్రాఫిక్ అండ్ స్పీడ్ కి అనుగుణంగా మీరు మళ్లీ మళ్లీ గేర్‌ను మార్చడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇండియా ఎక్కువ జనాభా కలిగిన దేశం. ఈ ప్రభావం ట్రాఫిక్ వ్యవస్థపై కూడా కనిపిస్తోంది. సొంత వాహనాలను కొని నడపాలన్న ఆసక్తి పెరగడంతో రోడ్లపై వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రోడ్డు పై పెరుగుతున్న ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఆటోమేటిక్ గేర్‌తో వాహనాలకు ఆదరణను విస్మరించలేము. భారతదేశంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న కారు స్పెషాలిటీ ఏమిటంటే, రోడ్డుపై ట్రాఫిక్ అండ్ స్పీడ్ కి అనుగుణంగా మీరు మళ్లీ మళ్లీ గేర్‌ను మార్చడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాన్యువల్ గేర్‌బాక్స్ కార్లలో ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా గేర్‌ను మార్చల్సి ఉంటుంది.
మీరు కూడా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు మీ బడ్జెట్ ధరకే వస్తుంది. ఇందుకు మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. 5-6 లక్షల బడ్జెట్‌లో ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కారును కొనుగోలు చేయవచ్చు. దేశంలోనే అత్యంత చౌకైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారు గురించి మీకోసం..
undefined
మారుతి S-ప్రెస్సో ఇంజన్ అండ్ ట్రాన్స్‌మిషన్
మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి S ప్రెస్సో దేశంలోనే చౌకైన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కారు. కొత్త 2022 మారుతి S ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ నెక్స్ట్ జెన్ K-సిరీస్ 1.0L డ్యూయల్ జెట్ ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజన్ నుండి శక్తిని పొందుతుంది. ఈ కారు 5,500rpm వద్ద 65bhp శక్తిని, 3,500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 5-స్పీడ్ మాన్యువల్ అండ్ AGS (ఆటో-గేర్ షిఫ్ట్) లేదా AMT ఉన్నాయి. AGS టాప్-స్పెక్ Vxi అండ్ Vxi+ వేరియంట్‌లలో పరిచయం చేసారు.
మైలేజీ గురించి మాట్లాడితే మారుతి సుజుకి 2022 మారుతి S-ప్రెస్సో AGS ARAI వేరిఫైడ్ మైలేజీ 25.30 kmpl ఇస్తుందని పేర్కొంది . మాన్యువల్ వెర్షన్ 24.76 kmpl మైలేజీ ఇస్తుంది. సైజ్ పరంగా కొత్త 2022 మారుతి S-ప్రెస్సో 3,565 mm పొడవు, 1,520 mm వెడల్పు, 1,567 mm ఎత్తు ఉంటుంది.
ఫీచర్లు
కొత్త 2022 మారుతి S ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ ఫీచర్ల గురించి మాట్లాడితే 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా కొత్త 2022 మారుతి S-Presso AGS వేరియంట్ ఇప్పుడు హిల్ హోల్డ్ అసిస్ట్‌తో ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) వంటి ఫీచర్లతో వస్తుంది. Vxi అండ్ VXi+ ట్రిమ్‌లు ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ORVMలను పొందుతాయి. ఎంట్రీ-లెవల్ టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ప్రీ-టెన్షనర్‌లతో కూడిన ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్‌బెల్ట్‌లు, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లను కూడా పొందుతుంది.
ధర ఎంత అంటే
మారుతి S-Presso 4 ట్రిమ్ లెవెల్స్ లో లభిస్తుంది - Std, LXi, Vxi అండ్ Vxi - ధర రూ. 4.25 లక్షల నుండి రూ. 5.99 లక్షల మధ్య ఉంటుంది. S-Presso VXi Opt AT వేరియంట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.65 లక్షలు.
మారుతి సుజుకి లైనప్‌లో ఈ కార్లు కూడా ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ తో ఉన్నాయి. మీరు ఈ బడ్జెట్‌లో మారుతి సెలెరియో VXI AMTని కూడా పరిగణించవచ్చు, దీని ధర రూ.6.24 లక్షలు. కాగా మారుతి వ్యాగన్ ఆర్ వీఎక్స్ఐ ఏటీ ధర రూ.6.41 లక్షలు. అంతేకాకుండా, Renault KWID 1.0 RXT AMT కారు రూ. 5.79 లక్షలకు అందుబాటులో ఉంది.