ఈ SUVలో చాలా స్పోర్టీగా కనిపించే ట్రిమ్ కూడా కనిపిస్తుంది. ఇది ఈ SUV M స్పోర్ట్ వేరియంట్, ఈ కారణంగా క్రికెటర్ దీనిని సెలెక్ట్ చేసుకున్నాడు. X7 కాకుండా యువరాజ్ దగ్గర ఇతర BMW కార్లు ఉన్నాయి.
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 లేటెస్ట్ జనరేషన్ మోడల్‌ను కొనుగోలు చేశాడు. ఈ కార్ xDrive40i M స్పోర్ట్ వేరియంట్, ఇది ప్రస్తుతం X7 టాప్-ఎండ్ వేరియంట్. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.19 కోట్లు. కారు మరో వేరియంట్ xDrive30d DPE సిగ్నేచర్ కూడా రూ. 1.18 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. X7 ప్రస్తుతం BMW ఫ్లాగ్‌షిప్ SUV.
కార్ కలెక్షన్
యువరాజ్ సింగ్ BMW X7 లగ్జరీ SUV కలర్ ఫైటోనిక్ బ్లూ. ఈ SUVలో చాలా స్పోర్టీగా కనిపించే ట్రిమ్ కూడా కనిపిస్తుంది. ఇది ఈ SUV M స్పోర్ట్ వేరియంట్, ఈ కారణంగా క్రికెటర్ దీనిని సెలెక్ట్ చేసుకున్నాడు. X7 కాకుండా యువరాజ్ దగ్గర ఇతర BMW కార్లు ఉన్నాయి. ఇందులో F10 M5, E60 M5, F86 X6M అండ్ E46 M3 మోడల్‌లు ఉన్నాయి.
undefined
ఇంజిన్ అండ్ పవర్
BMW X7 xDrive40i వేరియంట్ 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 340 hp శక్తిని, 450 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. xDrive30d వేరియంట్‌లో 3.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 265hp శక్తిని, 620 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టాప్ స్పీడ్
ఈ పెట్రోల్ ఇంజన్ టాప్ స్పీడ్ 245 kmph. కేవలం 6.1 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు. డీజిల్ ఇంజిన్ టాప్ స్పీడ్ 227 kmph ఇంకా 0 నుండి 100 kmph వరకు స్పీడ్ 7 సెకన్లలో అందుకుంటుంది. రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటాయి. ఇంకా రెండూ xDrive వేరియంట్‌లు కావడం వల్ల పవర్ నాలుగు చక్రాలకు పంపిస్తుంది.
ఈ కార్ ఫీచర్ల గురించి మాట్లాడుతూ LED టెయిల్ ల్యాంప్, రెండు-భాగాల ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, లేజర్ లైట్‌తో కూడిన హెడ్‌ల్యాంప్, 22.0-అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది. క్యాబిన్ లోపల గేర్ షిఫ్టర్, ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి/ఆపడానికి పుష్ బటన్ గ్లాస్ తో తయారు చేయబడ్డాయి. అప్హోల్స్టరీ కోసం అధిక నాణ్యత లేధర్ ఉపయోగించారు. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరెన్నో ఉన్నాయి.
లేటెస్ట్ ఫీచర్లు కాకుండా ఈ SUV హర్మాన్ ఆడియో సిస్టమ్ పొందుతుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేటెస్ట్ iDrive ఇంటర్‌ఫేస్, ఇతర కనెక్ట్ టెక్నాలజితో అమర్చబడి ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఫీచర్ల గురించి చెప్పాలంటే, గెశ్చర్ కంట్రోల్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. వాల్యూమ్ కంట్రోల్ అండ్ ఇతర ఫీచర్‌లను ఉపయోగించడానికి, మీరు చేయాల్సిందల్లా గెశ్చర్ చేయడం.