టొయోటా కొత్త కార్ .. డిజైన్, లుక్ అదిరిపోయిందిగా.. ఇంజన్, ఫీచర్స్ ఇదిగో..

By asianet news telugu  |  First Published Nov 21, 2023, 12:18 PM IST

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ 2024లో గ్లోబల్ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు  కొత్త ప్లాట్‌ఫారమ్, ఇంజన్ అప్షన్స్ తో పాటు గొప్ప డిజైన్ మార్పులు, కొత్త ఇంటీరియర్‌ను పొందుతుంది. ప్రస్తుత ఫార్చ్యూనర్ ఇన్నోవా క్రిస్టాకు IMV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంది. 


జపాన్‌కు చెందిన కంపానీ టొయోటా హిలక్స్ లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్‌ను యూరోపియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. Hilux MHEV అని పిలవబడే, ఈ కొత్త పికప్ యూరోపియన్ మార్కెట్ కోసం థాయిలాండ్‌లో తయారు చేయనుంది. కొత్త మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ కొత్త టయోటా ఫార్చ్యూనర్, ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో,  ల్యాండ్ క్రూయిజర్ 70తో సహా ఇతర టయోటా మోడళ్లలో ప్రవేశపెట్టబడుతుందని కొత్త నివేదికలు సూచిస్తున్నాయి.

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ 2024లో గ్లోబల్ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు  కొత్త ప్లాట్‌ఫారమ్, ఇంజన్ అప్షన్స్ తో పాటు గొప్ప డిజైన్ మార్పులు, కొత్త ఇంటీరియర్‌ను పొందుతుంది. ప్రస్తుత ఫార్చ్యూనర్ ఇన్నోవా క్రిస్టాకు IMV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంది. అయితే, నెక్స్ట్  జనరేషన్  మోడల్ కొత్త TNGA-F ఆర్కిటెక్చర్‌పై రూపొందించి అభివృద్ధి చేయబడుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ల్యాండ్ క్రూయిజర్ 300, లెక్సస్ LX 500D, Tacoma పికప్‌తో సహా మల్టి గ్లోబల్ కార్లకు సపోర్ట్  చేస్తుంది. ఈ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ విభిన్న బడి స్టయిల్ కు, ICE అండ్  హైబ్రిడ్‌తో సహా మల్టి  ఇంజిన్ అప్షన్ కు అనుకూలంగా ఉంటుంది.

Latest Videos

undefined

కొత్త Toyota Hilux MHEV  2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్,  48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సెటప్‌తో వస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని చేర్చడం వల్ల సాధారణ మోడల్ కంటే 10 శాతం ఫ్యూయల్  సిస్టం మెరుగుపడిందని కంపెనీ పేర్కొంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హైబ్రిడ్ సెటప్‌లో 48-వోల్ట్ బ్యాటరీ, చిన్న ఎలక్ట్రిక్ మోటార్-జనరేటర్  ఇతర భాగాలు ఉంటాయి. వాహనం స్టాప్/స్టార్ట్ సిస్టమ్‌తో వస్తుంది. 

కొత్త టయోటా ఫార్చ్యూనర్ 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌  48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సెటప్‌తో పొందుతుంది. కొత్త మోడల్ Tacoma పికప్ నుండి స్టైలింగ్ ఇండికేషన్స్ రావొచ్చని భావిస్తున్నారు.   బెటర్  ఆఫ్-రోడ్ క్రెడెన్షియల్స్, వైడ్ ఫెండర్ ఫ్లేర్స్, స్ట్రింగ్ బానెట్, తెల్లటి బాడీవర్క్‌తో కూడిన బ్లాక్ రూఫ్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, స్కిడ్ ప్లేట్‌ల చుట్టూ ప్రముఖ క్లాడింగ్ కోసం అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్ డిజైన్‌తో ఉంటుంది. ఈ  SUVకి 2.4-లీటర్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా లభిస్తుంది.  

ఎలక్ట్రిక్ మోటార్ మెరుగైన టార్క్ అసిస్ట్, సపోర్ట్ రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మైల్డ్ హైబ్రిడ్ సెటప్ Hilux   ఆఫ్-రోడ్ అండ్  టోయింగ్ సామర్థ్యాలపై ఎటువంటి ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది. 

click me!