నార్టన్ లిమిటెడ్ వేరియంట్ బైక్స్ సంవత్సరాలుగా బైక్ తయారీదారుల ఐకానిక్ మోడల్‌ల నుండి ప్రేరణ పొందింది. వీటిలో ఎనర్గెట్, మ్యాంక్స్, ఫార్ములా 750 వర్క్స్ రేసర్, NRS588 ఉన్నాయి. నార్టన్ ఎనర్జెట్ 1902లో ప్రవేశపెట్టబడింది.
ఇండియాకి చెందిన TVS మోటార్ కంపెనీకి చెందిన బ్రిటిష్ బైక్ తయారీ సంస్థ నార్టన్ మోటార్‌సైకిల్స్ 125వ సంవత్సరంలోకి ప్రవేశించింది. దీనికి గుర్తుగా, కంపెనీ కొత్త లిమిటెడ్ వేరియంట్ బైక్స్ ని పరిచయం చేసింది. నార్టన్ కమాండో 961 SP, కమాండో 961 CR, V4SV అండ్ V4CR లిమిటడ్ వేరియంట్‌ల ఉత్పత్తి 125 యూనిట్లకు పరిమితం చేసింది. ఈ బైక్స్ పాత బ్రాండ్ ఐకానిక్ బైక్స్ మెమరీని రిఫ్రెష్ చేస్తుంది.
నార్టన్ లిమిటెడ్ వేరియంట్ బైక్స్ సంవత్సరాలుగా బైక్ తయారీదారుల ఐకానిక్ మోడల్‌ల నుండి ప్రేరణ పొందింది. వీటిలో ఎనర్గెట్, మ్యాంక్స్, ఫార్ములా 750 వర్క్స్ రేసర్, NRS588 ఉన్నాయి. నార్టన్ ఎనర్జెట్ 1902లో ప్రవేశపెట్టబడింది.
దీని తరువాత, నార్టన్ కమాండో 961 LE ట్రాన్స్‌అట్లాంటిక్ F750 రేస్ బైక్‌పై ఆధారపడింది. లిమిటెడ్ వేరియంట్ దాని పేరును అట్లాంటిక్ ట్రోఫీ నుండి తీసుకుంది. పరిమిత వేరియంట్‌లో లోగోతో పాటు 125 సంవత్సరాల వార్షికోత్సవ చిహ్నం కూడా లభిస్తుంది.
UKలో, పరిమిత వేరియంట్ నార్టన్ బైక్ ధర £18,999 నుండి £51,999 (దాదాపు రూ. 19.71 లక్షల నుండి రూ. 53.95 లక్షలు). ప్రధానంగా UK అండ్ ఐరోపాలో అందుబాటులో ఉంటుంది. బైక్ తయారీ సంస్థ దీనిని భారతదేశంతో సహా ఇతర మార్కెట్లలో విడుదల చేసే ప్రణాళికలను ఇంకా ప్రకటించలేదు.