హార్లీ డేవిడ్సన్‘ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్

By rajesh yFirst Published Aug 28, 2019, 11:22 AM IST
Highlights


అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్.. భారత విపణిలోకి ‘లైవ్ వైర్’ను ఆవిష్కరించింది. ఈ సంస్థ బీఎస్-6 ప్రమాణాలతో విడుదల చేసిన బైక్ ఇదే. త్వరలో భారతీయ యువత ఆకాంక్షలకు అనుగుణంగా ‘స్ట్రీట్ 750’ బైక్ ఆవిష్కరించనున్నది.

న్యూఢిల్లీ‌‌: అమెరికాలోని విలాసవంతమైన మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్‌ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ ‘లైవ్‌ వైర్‌’ను మంగళవారం భారత విపణిలో ఆవిష్కరించింది. గత జనవరిలోనే బైక్‌కు సంబంధించిన ధర, ఫీచర్లు ఇతర వివరాలను వెల్లడించారు. 

ముందుగా నిర్ణయించినట్లు భారత్‌లో హార్లీ డేవిడ్సన్ ‘లైవ్ వైర్’ బైక్ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ఆరంభంలోగానీ దీనిని భారత్‌ మార్కెట్‌లోకి రానున్నాయి. బైక్‌తోపాటు హెచ్‌వోజీ కమ్యూనిటీ యాప్‌ని కూడా ఆవిష్కరించారు. 

భారత రైడర్ల అభిరుచులకు అనుగుణంగా త్వరలో స్ట్రీట్‌ 750ని కూడా తేనున్నట్లు హార్లీ డేవిడ్సన్ ప్రకటించింది. హర్లీ డేవిడ్‌సన్‌ నుంచి రానున్న బీఎస్‌-6 తొలి ద్విచక్రవాహనం ఇదే కావడం విశేషం. అలాగే రైడర్లకు శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. 

లైవ్‌ వైర్‌ బైక్ 15.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో పని చేయనున్నది. ఈ బైక్‌ 78కిలో వాట్‌ లేదా 104.6 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. అలాగే 116ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ వాహనం కావడంతో బైక్ స్టార్ట్‌ చేసిన కేవలం 3.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి ఛార్జి చేస్తే ఇది సుమారు 235 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 

పానాసోనిక్ సహకారంతో కంపెనీ ఈ బైక్‌లో టెలీమాటిక్స్ కంట్రోల్ యూనిట్ (టీసీయూ) అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో దీన్ని యాప్‌కి అనుసంధానం చేయవచ్చు. దీని ద్వారా బైక్ బ్యాటరీ స్టేటస్, వెహికల్ ట్రాకింగ్ తదితర అంశాలు తెలుసుకోవచ్చు. 

బ్యాటరీ స్టేటస్‌, సర్వీస్ గడువు, దగ్గర్లోని ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు వంటి సమాచారం లభిస్తుంది. అలాగే దీనిలో ఉండే టచ్‌స్క్రీన్‌తో ఫోన్‌కాల్స్‌ని స్వీకరించొచ్చు. మ్యూజిక్‌ని ఎంజాయ్‌ చేయవచ్చు. బ్లూటూత్‌ సౌకర్యం కూడా ఉంది.
 

click me!