తాలిబాన్ గడ్డపై నిర్మించిన మొదటి సూపర్‌కార్..! యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ కారు గురించి తెలుసా..?

By asianet news teluguFirst Published Jan 17, 2023, 7:24 PM IST
Highlights

కాబూల్‌కు చెందిన తయారీదారి ఎంటోప్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ (ATVI) ఒక సూపర్‌కార్‌ను రూపొందించడానికి అలాగే నిర్మించడానికి చేతులు కలిపింది. ఆకర్షణీయమైన లుక్‌తో కూడిన ఈ సూపర్‌కార్‌ను 30 మంది ఆఫ్ఘన్ ఇంజనీర్లు కలిసి రూపొందించారని పేర్కొన్నారు. 

తాలిబాన్ పాలనలో నిర్మించిన సూపర్ కార్. ఇది చాలా వింతగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. సాధారణంగా ఆర్థిక సంక్షోభం ఇంకా అనేక సమస్యలతో పోరాడుతున్న దేశం కారణాల వల్ల చర్చలో ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ దేశం మొట్టమొదటి సూపర్ కారును అందుకుంది, దీనికి మడా 9(Mada 9) అని పేరు పెట్టారు. దీనిని గత వారం అధికారికంగా ప్రదర్శించారు. ఈ సూపర్‌కార్ దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 

కాబూల్‌కు చెందిన తయారీదారి ఎంటోప్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ (ATVI) ఒక సూపర్‌కార్‌ను రూపొందించడానికి అలాగే నిర్మించడానికి చేతులు కలిపింది. ఆకర్షణీయమైన లుక్‌తో కూడిన ఈ సూపర్‌కార్‌ను 30 మంది ఆఫ్ఘన్ ఇంజనీర్లు కలిసి రూపొందించారని పేర్కొన్నారు. ఎంటోప్ ఈ కారు గురించి ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా వెల్లడించింది. 

ప్రోగ్రెస్‌లో ప్రోటోటైప్
Mada 9 ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. ఈ కారు టయోటా 1.8-లీటర్ DOHC 16-వాల్వ్ VVT-i, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 2004 తరం కరోలా సెడాన్‌లో పరిచయం చేయబడింది. ఈ కారును తయారు చేసేందుకు ఇంజనీర్లు ఐదేళ్లకు పైగా సమయం తీసుకున్నారు. ఈ ఇంజిన్ టయోటా కార్లలో 166 అండ్ 187 మధ్య హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. మడా 9లో ఈ పవర్ పెంచిందో లేదో చెప్పలేం. ప్రస్తుతానికి, ఈ ఇంజన్ Mada 9లో ఎంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది లేదా ఏదైనా ట్యూనింగ్ చేయబడిందా లేదా అనే దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. 

ఎలక్ట్రిక్ వెర్షన్ రావచ్చు
ఆఫ్ఘనిస్తాన్  న్యూస్ ప్రకారం, దాని ఇంజన్ లేదా పవర్‌లో చాలా మార్పులు ఆశించవచ్చు. ప్రొడక్షన్ వెర్షన్ సిద్ధమయ్యే వరకు మడా 9లోని పెట్రోల్ ఇంజన్‌ని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో భర్తీ చేయవచ్చు. మాడా 9 పరిచయం సందర్భంగా, తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ, తాలిబాన్ పాలన  ప్రజలకు  ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందించడానికి కట్టుబడి ఉందని ఈ సూపర్‌కార్ రుజువు చేస్తుందని నివేదించారు. 

Mada 9 సూపర్‌కార్‌ను ఎప్పుడు లాంచ్ 
 ఈ సూపర్‌కార్‌ లాంచ్ తేదీని ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే, దీని సెల్స్ మొదట ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రారంభమవుతాయని, ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లలో ఈ కారును విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. 

click me!