EVTRIC మోటార్స్ మొట్ట మొదటి ఎలెక్ట్రిక్ బైక్.. జూన్ 22 నుండి బుకింగ్స్ ఓపెన్..

By asianet news teluguFirst Published Jun 22, 2022, 6:24 PM IST
Highlights

 EVTRIC మోటార్స్ టీము ఈ ఉత్పాదనను  డీలర్ల సమావేశం సందర్భంగా సిఖార్, రాజస్థాన్ లో రు. 1,59,990 (ఎక్స్-షోరూమ్ ఇండియా) ధరతో ఆవిష్కరించింది. ఈ సమావేశంలో మొత్తం రాజస్థాన్ లోని డీలర్ భాగస్వాములు అందరూ పాల్గొన్నారు అలాగే బ్రాండుచే ఈ నూతన ఆవిష్కరణను వీక్షించారు. 

పుణె, 22, జూన్ 2022:  EVTRIC మోటార్స్ – PAPLచే పుణె-ఆధారిత ఎలెక్ట్రిక్ వెహికల్ తయారీ వెంచర్  ఎలెక్ట్రిక్ బైక్  EVTRIC RISEని ఆవిష్కరించింది. 

ఈ బ్రాండుచే ఈ హై-స్పీడ్  బైక్ మొట్టమొదటి ఎలెక్ట్రిక్ బైక్, ఒక సొగసైన శైలిని ఇంకా హై-స్పీడ్ టెక్నాలజీని చాటి చెబుతోంది.  EVTRIC మోటార్స్ టీము ఈ ఉత్పాదనను  డీలర్ల సమావేశం సందర్భంగా సిఖార్, రాజస్థాన్ లో రు. 1,59,990 (ఎక్స్-షోరూమ్ ఇండియా) ధరతో ఆవిష్కరించింది. ఈ సమావేశంలో మొత్తం రాజస్థాన్ లోని డీలర్ భాగస్వాములు అందరూ పాల్గొన్నారు అలాగే బ్రాండుచే ఈ నూతన ఆవిష్కరణను వీక్షించారు. 

ఈ బ్రాండు విద్యుత్ వాహన విభాగములో 'మేడ్ ఇన్ ఇండియా’ యొక్క అంతిమ దార్శనికతను ప్రోత్సహిస్తూ వస్తోంది.  ఎంతగానో ఎదురు చూసిన ఎలెక్ట్రిక్ బైక్ EVTRIC RISE గంటకు 70 కిలోమీటర్ల అత్యధిక వేగముతో ప్రయాణిస్తుంది అలాగే ఒక సింగిల్ ఛార్జ్ తో సులభంగా 110 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. ఇంకా 4 గంటల లోపున పూర్తిగా ఛార్జ్ అయ్యే లీథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఆటో కట్ ఫీచరుతో   వచ్చే 10amp మైక్రో ఛార్జరుతో సౌకర్యంగా ఇంకా సురక్షితంగా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి ఈ బైక్ వీలు కలిగిస్తుంది. 

 రెండు వైపుల షార్ప్ కట్స్  డ్యాష్ తో చూడడానికి సొగసైన స్పోర్టీ లుక్  ఉంటుంది. పగటిపూట  నడిచే లైట్ ఫంక్షన్ తో దీనికి LED  ఉంటుంది. వాహనదారులకు అత్యంత అధునాతన ఫీచర్లను అందిస్తూ విశిష్టమైన రియర్ వింకర్స్ తో కూడా వస్తుంది. RISE ఒక 2000 వ్యాట్ BLDC మోటర్ తో  70v/40ah లీథియం- అయాన్ బ్యాటరీతో శక్తి పొందుతుంది. ఈ కొత్త బైక్ నిశ్చేష్టమైన ఎరుపు, నలుపు రంగుల్లో వస్తుంది, అలాగే ప్రతిరోజూ ప్రయాణానికి చల్లని ఆహ్లాదాన్ని జోడిస్తుంది. 

 బ్రాండు  మొట్టమొదటి బైక్  ఆవిష్కరణపై EVTRIC మోటార్స్ వ్యవస్థాపకులు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ పాటిల్ మాట్లాడుతూ  “మా అత్యంత అధునాతనమైన క్రియేటివిటీ RISE మా మొట్టమొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎలెక్ట్రిక్ బైక్ ని మీ ముందుకు తీసుకురావడం  ఎంతగానో ఆనందిస్తున్నాము. ICE నుండి EV కి మారడానికి వెనుకంజ వేస్తున్న కస్టమర్ల కోసం ఈ బైక్ నిజమైన నాణ్యతా అనుభూతిని నిర్వచిస్తుంది.  అత్యుత్తమ ఇ-మొబిలిటీ తయారీ ధ్యేయానికి తోడ్పాటు ఇవ్వడం, మార్కెట్ పురోగతికి ఇంకా కాలుష్యరహిత రేపటి రోజుకు దోహదపడటం భారతీయ ఆటో తయారీదారుల బాధ్యత అని మేము నమ్ముతున్నాము.  మేము ఆటోమేషన్ లో మా అనేక సంవత్సరాల అనుభవంతో మా శాయశక్తులా చేయడానికి తగిన సామర్థ్యంతో ఉన్నాము. మరి ఈ కొత్త EVTRIC RISE ఆ దిశలో మరొక మైలురాయిగా ఉంటుంది” అని ఆన్నారు.

భారతీయ వాహనదారులు పెట్రోల్ నుండి ఎలెక్ట్రిక్ వాహనాలకు మళ్ళడంలో ఒక రూపాంతరాన్ని అనుభూతి చెందుతున్నారు కాబట్టి, వారికి మంచి నాణ్యమైన విద్యుత్ వాహనాలను అందజేయడానికై బ్రాండు వెంట వెంటనే భారత్-లో-తయారీ ఉత్పత్తుల్ని ఆవిష్కరిస్తూనే ఉంది. ప్రస్తుతానికి బ్రాండు  ఇంతకుముందే రోడ్డుపై 3 ఎలెక్ట్రిక్ స్కూటర్లను వదిలింది, అవి - EVRIC AXIS, EVTRIC RIDE అండ్ EVTRIC MIGHTY, అలాగే ఇండియా వ్యాప్తంగా 22 రాష్టాల్లో 125 టచ్ పాయింట్లు ఉన్నాయి.

EVTRIC మోటార్స్ గురించి: 
వ్యవస్థాపకులు అండ్ సిఈఓ మనోజ్ పాటిల్ గారిచే స్థాపించబడిన EVTRIC, పుణె  ప్రధాన కార్యాలయం విద్యుత్ వాహన ఆటోమోటివ్  పరిశ్రమల్లో ఒకటిగా ఉండి, వివిధ OEM లు ఇంకా వాటి టయర్ 1 సరఫరాదారులకు సంపూర్ణ టర్న్‌కీ ఆటోమేషన్ ప్రాజెక్టుల నిర్మాణమ అండ్ సమీకృతపరచే కార్యములో నిమగ్నమైయున్న ఇండియా- ఆధారిత ఆటోమేషన్ కంపెనీ  PAPL చే ఆవిష్కరించబడింది. EVTRIC మోటార్స్, ఆటోమొబైల్ రంగములో 20 సంవత్సరాలకు పైగా నిమగ్నతను కలిగియున్న అనుభవజ్ఞులైన నిపుణుల ఆధ్వర్యములో ఇంకా వారిచే నిర్వహణ చేయబడుతూ ఉంది. కంపెనీ ఉత్పత్తులు iCAT చే ఆమోదించబడి ఉన్నాయి.  

click me!