E-scooter:డిమాండ్ పెరగడంతో ధరల పెంపు.. అమ్మకాలు కూడా నిరంతరం పెరుగుతూనే..

By asianet news telugu  |  First Published Mar 4, 2022, 1:24 PM IST

ఇ-వాహనాల పట్ల ప్రజలలో పెరుగుతున్న ఆకర్షణ కారణంగా, ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీల ఆదాయాలు వేగంగా పెరిగాయి. జాయ్ ఇ-బైక్స్ అని పిలిచే ఇ-టూ వీలర్‌లను తయారు చేసే వార్డ్‌విజార్డ్ ఫిబ్రవరి 2022లో 4,450 ఇ-బైక్‌లను విక్రయించింది. ఫిబ్రవరి 2021తో పోలిస్తే ఇది 1,290 శాతం పెరుగుదల.



ద్రవ్యోల్బణం, ముడి చమురు పెరుగుదల తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు కూడా వచ్చే మూడేళ్లలో రూ. 45,000 వరకు పెరగవచ్చు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజల్లో అవగాహన పెరగడం వల్లే ఈ-వాహనాలకు డిమాండ్ పెరుగుతోందని క్రిసిల్ నివేదికలో పేర్కొంది.  

నివేదిక ప్రకారం, ఇ-స్కూటర్‌ల పట్ల ప్రజల ఆకర్షణ పెరగడం వల్ల 2025 నాటికి వాటి ధరలు రూ.45,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇ-వాహనాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (PLI) పథకం ద్వారా దీనిని భర్తీ చేయవచ్చు. ఖర్చు-సమర్థత, వివిధ మోడళ్ల లభ్యత, సులభంగా ఇంటి వద్ద ఛార్జింగ్ ఆప్షన్ కారణంగా ఇ-వాహనాల స్వీకరణ కొనసాగుతుంది.

Latest Videos

undefined

ఫేమ్-2 క్రిసిల్ కింద 85 శాతం సబ్సిడీ
 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల పెరుగుదల ప్రధానంగా నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కింద ఫేమ్ పథకం, వివిధ రాష్ట్రాల నుండి సబ్సిడీల ద్వారా సాధ్యమైందని నివేదికలో పేర్కొంది. ఈ రాయితీలు ట్రెడిషనల్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజన్(ICE) వాహనం, ఎలక్ట్రిక్ వాహనల కొనుగోలు ధర మధ్య వ్యత్యాసాన్ని కవర్ చేస్తాయి. ఫేమ్ మొదటి దశ కింద మొత్తం 60-65 శాతం నుండి ఫేమ్ రెండవ దశ కింద ఈ సబ్సిడీ 85 శాతానికి పెరిగింది.

అమ్మకాలలో స్థిరమైన పెరుగుదల
ఈ-వాహనాల పట్ల ప్రజలలో పెరుగుతున్న ఆకర్షణ కారణంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీల ఆదాయాలు వేగంగా పెరిగాయి. జాయ్ ఇ-బైక్స్ అని పిలిచే ఇ-టూ వీలర్‌లను తయారు చేసే వార్డ్‌విజార్డ్ ఫిబ్రవరి 2022లో 4,450 ఇ-బైక్‌లను విక్రయించింది. ఫిబ్రవరి 2021తో పోలిస్తే 1,290 శాతం పెరుగుదల. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్2021-ఫిబ్రవరి 2022), కంపెనీ 25,000 యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించింది.

హీరో ఎలక్ట్రిక్ భారతదేశంలో మొట్టమొదటి లిథియం అయాన్ ఆధారిత ఇ-స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. కంపెనీ ఇప్పటివరకు 4.5 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. హై స్పీడ్, లో స్పీడ్ తో సహా మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2020తో పోలిస్తే 2021లో 132 శాతానికి పైగా పెరిగాయి.

ఖర్చు తగ్గుదల
ICE వేరియంట్‌లతో పోలిస్తే 2021-22 అండ్ 2022-23లో ఫేమ్ కింద సబ్సిడీ మొత్తం ఇ-స్కూటర్‌ల కొనుగోలు ధర రూ.7,500-9,500 తగ్గుతుంది. ఈ నేపథ్యంలో కొన్నేళ్లలో విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. 
 

click me!