Mercedes-Maybach S-Class 2022: ఇండియాలోకి మెర్సిడెస్ మేబ్యాక్ మరో లగ్జరీ కార్ లాంచ్.. ఎక్కువ సేఫ్టీ ఫీచర్లతో

By asianet news telugu  |  First Published Mar 3, 2022, 6:17 PM IST

మెర్సిడెస్ మహారాష్ట్రలోని చకన్ తయారీ కర్మాగారంలో కొత్త మేబ్యాక్ ఎస్-క్లాస్‌ను స్థానికంగా ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ ఎస్580 (maybach S-class S580) ఎడిషన్‌ను భారతదేశంలో తయారు చేస్తుంది, అయితే S680 వెర్షన్‌లు దిగుమతి చేయబడతాయి. 


లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్ ఇండియా (mercedes benz india) గురువారం  మేబ్యాక్ (maybach) క్రింద కొత్త ఎస్-క్లాస్ సెడాన్ (s-class sedan) లాంచ్‌ చేసింది. 2022 మెర్సిడెస్ మేబ్యాక్  ఎస్-క్లాస్ ని  ఇండియాలో రూ. 2.5 కోట్ల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు. కొత్త మేబ్యాక్ ఎస్-క్లాస్ స్థానికంగా నిర్మించిన యూనిట్లు అండ్ పూర్తిగా నిర్మించబడిన యూనిట్లు (CBU) రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. సెడాన్  దిగుమతి చేసుకున్న యూనిట్ల ధర రూ. 3.2 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుండి అందుబాటులో ఉంటాయి. 

మెర్సిడెస్ మహారాష్ట్రలోని చకన్ తయారీ కర్మాగారంలో కొత్త మేబ్యాక్ ఎస్-క్లాస్‌ను స్థానికంగా ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ ఎస్580 (maybach S-class S580) ఎడిషన్‌ను భారతదేశంలో తయారు చేస్తుంది, అయితే S680 వెర్షన్‌లు దిగుమతి చేయబడతాయి. 

Latest Videos

undefined

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ ధరలు 
 
వెరియంట్స్    ధర (రూ.ఎక్స్-షోరూమ్)
S 580 4MATIC    2.5 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది
S 680 4MATIC    3.2 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది

 రెండు వేరియంట్‌ల ఇంజిన్ పవర్ అండ్ స్పీడ్ 
రెండు వేరియంట్లను 4.0-లీటర్ V8 ఇంజన్‌తో అందిస్తున్నారు. గరిష్టంగా 496 hp శక్తిని, 700 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం ఐదు సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు. 

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ ఎస్ 680 4MATIC, CBU ద్వారా అందుబాటులో ఉంటుంది, ఇంకా 6.0-లీటర్ V12 ఇంజిన్‌ను పొందుతుంది అలాగే ఆల్-వీల్ డ్రైవ్‌ను 4MATIC డ్రైవ్‌తో మొదటిసారి అందించారు. ఈ ఇంజన్ 612 hp శక్తిని, 900 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ వేరియంట్ గరిష్టంగా 250 kmph వేగంతో 4.5 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు. మేబ్యాక్ ఎస్-క్లాస్ దిగుమతి చేసుకున్న యూనిట్లు డ్యూయల్-టోన్ ఎక్ట్సీరియర్ కలర్ స్కీమ్‌తో అందించబడతాయి. 

మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ మేబ్యాక్ బ్రాండింగ్ కింద లాంజ్ లాంటి అనుభూతితో లగ్జరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళుతుంది. అంటే ఎలక్ట్రిక్‌తో పనిచేసే సౌకర్యవంతమైన బ్యాక్ డోర్, మసాజ్ ఫంక్షన్‌తో కుర్చీ, లెగ్ రెస్ట్ అండ్ ఫోల్డింగ్ టేబుల్ ఇంకా బ్యాక్ సీటు ప్రయాణీకుల కోసం ఎలక్ట్రిక్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఎన్నో ఫీచర్లను పొందుతుంది.

పెద్ద డిస్‌ప్లే యూనిట్
డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, ఆర్మ్‌రెస్ట్‌లు ఒకే యూనిట్‌గా కనెక్ట్ చేయబడ్డాయి ఇంకా పైకి తేలే ప్రభావంతో వస్తాయి. కారు లోపల ఐదు డిస్‌ప్లే స్క్రీన్‌లు ఉన్నాయి. 12-అంగుళాల OLED సెంటర్ డిస్‌ప్లే స్టాండర్డ్ గా చేర్చబడినప్పటికీ, 12.3-అంగుళాల 3D డ్రైవర్ డిస్‌ప్లే 3D ఎఫెక్ట్‌లతో అందుబాటులో ఉంది.

లెవెల్ 2 ఆటోమేషన్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్
2022 మేబ్యాక్ ఎస్-క్లాస్ లెవెల్ 2 ఆటోమేషన్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్‌తో వస్తుంది. అంటే క్రాస్-ట్రాఫిక్ ఫంక్షన్‌తో ఎవాసివ్ డ్రైవ్ అసిస్ట్ అండ్ యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. అంటే బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ ఇంకా లేన్-కీప్ అసిస్ట్ వంటి సెల్ఫ్ ఆటోమేటిక్ భద్రతా ఫీచర్లను కూడా పొందుతుంది. 

మేబ్యాక్ ఎస్-క్లాస్ సేల్స్ 
ఇప్పటికే మేబ్యాక్ ఎస్-క్లాస్ సేల్స్  అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్నాయి. గత సంవత్సరం V8, V12 ఇంజిన్‌లతో ప్రారంభించారు ఇంకా లగ్జరీ సెడాన్ విభాగంలో బెంట్లీ (bentley), రోల్స్ రాయిస్ (rolls royce) వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతుంది.

click me!