భారత్‌లో దిగిన డుకాటీ స్క్రాంబ్లర్ 1100

By sivanagaprasad KodatiFirst Published 27, Aug 2018, 4:25 PM IST
Highlights

స్టైలీష్‌ బైకులను ఇష్టపడే వారి కోసం ప్రముఖ బైకుల తయారీ సంస్థ డుకాటీ తన కొత్త స్క్రాంబ్లర్‌ 1100 భారత్‌లో విడుదల చేసింది. స్టాండర్డ్, స్పెషల్, స్పోర్ట్స్ అనే మూడు రకాల వేరియంట్లలో విడుదల చేసింది. 

స్టైలీష్‌ బైకులను ఇష్టపడే వారి కోసం ప్రముఖ బైకుల తయారీ సంస్థ డుకాటీ తన కొత్త స్క్రాంబ్లర్‌ 1100 భారత్‌లో విడుదల చేసింది. స్టాండర్డ్, స్పెషల్, స్పోర్ట్స్ అనే మూడు రకాల వేరియంట్లలో విడుదల చేసింది. స్టైలింగ్ పరంగా 803 సీసీ స్క్రాంబ్లర్‌ను కొత్త స్క్రాంబ్లర్ పోలి ఉంటుంది. ముందుగా వచ్చిన మోడళ్ల కంటే ఈ లేటేస్ట్ వెర్షన్ చూడటానికి స్టైలిష్‌గా, దృఢంగా కనిపిస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.91 లక్షలు... స్క్రాంబ్లర్ 1100 స్పెషల్ ధర రూ. 11.12 లక్షలు, స్పోర్ట్స్ స్క్రాంబ్లర్ ధర రూ.11.42 లక్షలు.

డుకాటీ స్క్రాంబ్లర్ 1100 ప్రత్యేకతలు:
* ఎల్ ట్విన్ ఇంజిన్
* 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్
* 1079 సీసీ 
* 85 బీహెచ్‌పీ పవర్
* 88 ఎన్‌కమ్ టార్క్
* ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
* ఫ్రంట్ రెండు డిస్క్ బ్రేకులు
* వెనుక భాగంలో మరో డిస్క్ బ్రేక్
* మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్

Last Updated 9, Sep 2018, 12:10 PM IST