Tata Motors offers: టాటా మోటార్స్ కార్లపై భారీ ఆఫ‌ర్లు.. ఈ నెల మాత్ర‌మే ఛాన్స్‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 07, 2022, 04:14 PM IST
Tata Motors offers: టాటా మోటార్స్ కార్లపై భారీ ఆఫ‌ర్లు.. ఈ నెల మాత్ర‌మే ఛాన్స్‌..!

సారాంశం

 దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల విక్రయాలు పెంచుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించింది. గత ఏడాది కొవిడ్ వల్ల ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగనందున.. వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) భారతదేశంలోని టియాగో, టిగోర్, హారియర్, సఫారీ మోడళ్లతో సహా ఎంపిక చేసిన మోడళ్లపై అనేక రకాల ఆఫర్లను ప్రకటించింది. ఈ తగ్గింపులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ అండ్ లాయల్టీ డిస్కౌంట్ రూపంలో అందించనుంది.  అయితే టాటా  కంపెనీ  టాటా నెక్సాన్ (Nexon), టియాగో(Tiago), హారియర్( Harrier), సఫారి (Safari) వంటి మోడళ్లపై ఈ తగ్గింపును అందిస్తోంది. గత ఏడాది కొవిడ్ వల్ల ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగనందున వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మోడళ్లను బట్టి రూ. 10 వేల నుంచి రూ.60 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఆఫ‌ర్లు ఈ నెలాఖరు వరకు ఉంటాయ‌ని సంస్థ పేర్కొంది. 

సఫారీ 2021 వేరియంట్లపై అదిరే ఆఫర్​

టాటా ఫ్లాగ్​షిప్ ఎస్​యూవీ అయిన సఫారీపై టాటా మోటార్స్ భారీ ప్రకటించింది. అయితే హారియర్​ మాడల్​లానే సఫారీ కూడా డీజిల్​ వేరియంట్ మాత్రమే. అయితే ఇందులో ఆటో ట్రాన్స్​మిషన్ లేదా మాన్యువల్ వేరింయట్​ను ఎంచుకునే వీలుంది. ఇక ఆఫర్ విషయానికొస్తే.. రూ.60 వేల వరకు ఈ మోడల్​పై డిస్కౌంట్ ప్రకటించింది టాటా మోటార్స్​. 2021లో విక్రయం వాటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎక్ఛేంజ్ బెనిఫిట్స్ కలుపుకుని ఈ ఆఫర్​ పొందొచ్చని తెలిపింది. ఇక 2022 వేరియంట్ కావాలంటే.. ఎక్స్ఛేంజ్, డిస్కౌంట్ కలిపి రూ.40,000 వరకు తగ్గింపు పొందొచ్చని తెలిపింది టాటా మోటార్స్.

టాటా హారియర్​పై భారీ డిస్కౌంట్​

టాటా పోర్ట్​ఫోలియోలో మిడ్​సైజ్ ఎస్​యూవీ అయిన హారియర్​ మోడల్​పై కూడా రూ.60 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. ఈ ఆఫర్​ కూడా 2021 స్టాక్ పైనే లభిస్తుందని సంస్థ‌ తెలిపింది.
2022 వేరియంట్​పై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుందని తెలిపింది టాటా మోటార్స్​. డార్క్ ఎడిషన్ ట్రిమ్‌లు రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ కొనుగోలుదారులు SUVపై రూ. 25,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

టియాగోపై రూ.30 వేలు తగ్గింపు

ఇటీవలే విడుదల చేసిన టియాగో సీఎన్​జీ వేరియంట్​పై రూ.10 వేల వరగు రివార్డ్​తో పాటు.. రూ.20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్​ ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక కార్పొరేట్ కొనుగోలుదారులకు రూ.5 వేలు డిస్కౌంట్ ఇవ్వనుంది.

టాటా టిగోర్​ రూ.25 వేల వరకు తగ్గింపు

టాటా సెడాన్ విభాగంలోని టిగోర్​పై కూడా టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. సీఎన్​జీ వేరియంట్​లకు మినహా ఇతర వేరియంట్లపై రూ.25 వేల వరకు ఈ డిస్కౌంట్ పొందొచ్చని పేర్కొంది.

నెక్సాన్​పై ఆఫర్లు

టాటా కార్లలో ఎక్కువ మంది ఇష్టపడే మోడళ్లలో నెక్సాన్ కూడా ఒకటి ఈ మోడల్​ ఇంజిన్​, సహా ఇతర ఫీచర్లు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ మోడల్​పై ఎక్స్ఛేంజ్ ఆఫర్​ కింద రూ.15 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది టాటా మోటార్స్​. ఇక కార్పొరేట్ కొనుగోలుదారులకైతే రూ.10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఆల్ట్రోజ్​పై ఆఫర్లు ఇవే..!

టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​లలో ఒకటైన ఆల్ట్రోజ్​పై పరిమిత ఆఫర్​ను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. కార్పొరేట్ కొనుగోలుదారులకు మాత్రమే ఈ మోడల్​పై రూ.10 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

PREV
click me!

Recommended Stories

Ather Rizta: 20 నెలల్లో 2 లక్ష‌ల స్కూటీలు అమ్ముడ‌య్యాయి.. ఏంటా స్కూటీ, అంతలా ఏముంది
Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి