Electric Bike: మార్కెట్‌లోకి మ‌రో ఎల‌క్ట్రిక్ బైక్‌.. పూర్తి వివ‌రాలివే..!

By team telugu  |  First Published Feb 6, 2022, 2:21 PM IST

ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ ఒబెన్ ఈవీ తన మొదటి ఉత్పత్తులను మార్చి నాటికి లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని కంపెనీ సహ వ్యవస్థాపకులు తెలిపారు. కంపెనీ తన "అధిక పనితీరు" ఎలక్ట్రిక్ బైక్ అయిన ఒబెన్ రోర్‌ను ఏప్రిల్, జూన్ మధ్య పంపిణీ చేయడం ప్రారంభిస్తుంది. 
 


ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ ఒబెన్ ఈవీ తన మొదటి ఉత్పత్తులను మార్చి నాటికి లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని కంపెనీ సహ వ్యవస్థాపకులు తెలిపారు. కంపెనీ తన "అధిక పనితీరు" ఎలక్ట్రిక్ బైక్ అయిన ఒబెన్ రోర్‌ను ఏప్రిల్, జూన్ మధ్య పంపిణీ చేయడం ప్రారంభిస్తుంది. 

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్ట్-అప్ "ఓబెన్ ఈవీ" తన మొదటి ఎలక్ట్రిక్‌ బైక్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. కంపెనీ తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌కి 'ఓబెన్ రోర్' అని పేరు పెట్టింది. ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు దూసుకెళ్లనున్నట్లు కంపెనీ తన పోర్టల్‌లో తెలిపింది. వినియోగదారులకు 2022 రెండో త్రైమాసికంలో దీనిని డెలవరీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గరిష్ఠ వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఈ బైక్ 3 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

Latest Videos

undefined

ఈ బైక్ 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ కానుంది. ఇప్పటికే ఈ కంపెనీ ఈ బైక్ కోసం 16 పేటెంట్ హక్కులను పొందింది. కొత్త ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్‌ను మూడు వేరియెంట్లలో అందించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ బైక్ సుమారు రూ.1 లక్ష - రూ.1.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాక, రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి 6 నెలలకు ఒక కొత్త ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఓబెన్ ఈవీ సహ వ్యవస్థాపకుడు దింకర్ మీడియాతో మాట్లాడుతూ.. "మేము పూర్తిగా స్వదేశీ, పల్సర్ 180 సీసీ, 200 సీసీ బైక్‌లతో సమానంగా రైడింగ్ అనుభవాన్ని అందించే ఎలక్ట్రిక్ వాహనాన్ని సృష్టించాలనుకున్నాము" అని అన్నారు. ఈ బైక్‌ను రెండు గంటల్లోఫుల్ ఛార్జ్ చేయవచ్చు అని చెప్పారు. అదే డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద వాహనాన్ని ఒక గంటలో వేగంగా ఛార్జ్ చేయవచ్చు అని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల ఫండ్ కూడా రైజ్ చేసింది.

click me!