భారత్ మార్కెట్లోకి డుకాటీ పనిగేల్ బైక్.. ధర రూ.75 లక్షలు‌!

sivanagaprasad kodati |  
Published : Feb 03, 2019, 11:27 AM IST
భారత్ మార్కెట్లోకి డుకాటీ పనిగేల్ బైక్.. ధర రూ.75 లక్షలు‌!

సారాంశం

ప్రముఖ రోమ్ డిజైనింగ్ సంస్థ ఆఫిసిన్ జీపీ తాజాగా సరికొత్త మోటారు బైక్‌ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. వీ పెంటా, వీ4 ఎస్ బైక్ ల్లోని డిజైన్లకు అదనపు ఫీచర్లను జోడించి విడుదల చేసిన ఈ బైక్ ధర కేవలం రూ.75 లక్షలు మాత్రమే.  

ప్రముఖ ఇటలీ డిజైన్‌ సంస్థ ఆఫిసిన్‌ జీపీ డిజైన్‌ తాజాగా డుకాటీ పనిగేల్‌ వీ4లో కస్టమ్‌ బైక్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. దీని ధర దాదాపు రూ.74.5 లక్షలు. డుకాటీ పనిగేల్‌ వీ4 కస్టమ్‌ బైక్‌ పేరు వీ4 పెంటా. వీ4 ఎస్‌ బైక్‌లకు పలు అదనపు ప్రత్యేకతలను జోడించి ఈ బైక్‌ను రూపొందించింది.

‘డుకాటీ పనిగేల్ వీ4 పెంటా’లో కస్టమ్‌ స్పోక్డ్‌ వీల్స్‌, ఇంజిన్‌పై బ్రాంజ్‌ పౌడర్‌ కోటింగ్‌, క్రాంక్‌కేస్‌ కవర్స్‌, క్లాసిక్‌ స్టైల్డ్‌ గిర్‌డర్‌ ఫ్రంట్‌ ఎండ్‌ వంటి ప్రత్యకతలు ఉన్నాయి. ఈ బైక్‌ను లూకా పొజాటో డిజైన్‌ చేసింది.

ఇది కేవలం స్ట్రీట్‌ఫైటర్‌ మాత్రమే కాదు. అంతకు మించేలా ఉంది. ఫెరింగ్‌ తొలగింపుతో బైక్‌ నేక్‌డ్‌ స్ట్రీట్‌ ఫైటర్‌లా కనిపిస్తుంది. ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌. కేవలం 10 బైక్స్‌ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. 

బైక్‌కు సంబంధించిన హ్యాండ్‌బార్స్‌, ఇండికేటర్లు, ఫుట్‌పెగ్స్‌ సహా పలు ఇతర భాగాలను రిజోమా సంస్థ రూపొందించడం విశేషం. అయితే వీలైనన్ని ఎక్కువ బైక్‌లను భారత్‌లోనే విక్రయించేలా సంస్థ ప్లాన్‌ చేసుకున్నట్టుగా సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

తక్కువ ధరలో అద్భుత ఫీచర్లతో యమహా కొత్త బైక్‌లు లాంచ్
హీరో నుంచి స్ట‌న్నింగ్ బైక్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఇలాంటి ఫీచ‌ర్లు ఏంటి భ‌య్యా అస‌లు