ఇలాంటి రంగులు మార్చే కారును జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబల్యూ పరిచయం చేసింది. ఈ కార్ స్పెషాలిటీ ఏంటి అంటే దాని రంగును మార్చగలదు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ సోషల్ మీడియాలో వెల్లడించింది.
ఆటోమొబైల్ రంగంలో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. ఇవి కస్టమర్లకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు జర్మన్ కార్ల తయారీ సంస్థ బిఎండబల్యూ ఒక బటన్ నొక్కితే కలర్ ను మార్చే కారుతో ముందుకు వచ్చింది. ఈ కారుకు సంబంధించిన సమాచారం, ఫీచర్ల గురించి మీకోసం...
ఏ కంపెనీ కారు అంటే ?
ఇలాంటి రంగులు మార్చే కారును జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబల్యూ పరిచయం చేసింది. ఈ కార్ స్పెషాలిటీ ఏంటి అంటే దాని రంగును మార్చగలదు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఒక బటన్‌ను నొక్కితే చాలు కారు రంగును మార్చవచ్చని కంపెనీ ట్వీట్ చేసింది. E ఇంక్‌తో కూడిన BMW ix ఫ్లో తక్షణం రంగులను మార్చగలదు.
undefined
కారు ఎన్ని రంగులు మారుతుందంటే
ప్రస్తుతానికి, కారు గురించి కంపెనీ పూర్తిగా సమాచారం వెల్లడించలేదు. అయితే కారును మూడు రంగుల్లో మార్చుకోవచ్చు. ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా కారు రంగును తెలుపు నుండి నలుపుకు మార్చవచ్చు. అంతేకాకుండా, నలుపు రంగును బూడిద రంగులోకి కూడా మార్చవచ్చు.
రంగు ఎలా మారుతుందంటే ?
కారు రంగును మార్చే ప్రక్రియ గురించి కూడా కంపెనీ సమాచారం ఇచ్చింది. కంపెనీ ప్రకారం, ఈ ప్రక్రియ ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా నియంత్రించబడుతుంది. దీనిని ఎలెక్ట్రోఫోరేటిక్ టెక్నిక్ అంటారు. దీనికి అదనపు శక్తి అవసరం లేదు. దీని కింద వివిధ రంగుల పిగ్మెంట్లు ఉపరితలంపైకి వస్తాయి, తద్వారా ఇది మొత్తం కారుకు సెలెక్ట్ చేసుకున్నా రంగులోకి మారుస్తుంది. BMW ix ఫ్లో అనేది ఒక అడ్వాన్స్డ్ రీసర్చ్ అండ్ డిజైన్ ప్రాజెక్ట్ అలాగే BMW ఫార్వర్డ్-థింకింగ్‌కు గొప్ప ఉదాహరణ అని కంపెనీ గ్రూప్ డిజైన్ హెడ్ అడ్రియన్ వాన్నెస్ అన్నారు.
కారు కలర్ మార్చగల సామర్థ్యం నుండి కారుకి ప్రయోజనం కూడా ఉంది. వేసవిలో కారు రంగును తెల్లగా మార్చడం వల్ల ఉపయోగం ఏంటంటే తెలుపు రంగు సూర్యుని వేడిని గ్రహించదు కాబట్టి కారు తక్కువ వేడెక్కుతుంది ఇంకా చలికాలంలో కార్ కలర్ బ్లాక్ కలర్ లోకి మార్చడం వల్ల సూర్యుని వేడిని గ్రహిస్తుంది. ఈ కారణంగా కారు త్వరగా వేడెక్కుతుంది.