క్యాబ్‌లు కూడ మహిళలకు సేఫ్ కాదు: కేంద్ర మంత్రి మేనకా గాంధీ

First Published Jul 3, 2018, 11:38 AM IST
Highlights

క్యాబ్‌లు కూడ మహిళలకు సేఫ్ కాదన్న కేంద్ర మంత్రి మేనకాగాంధీ

న్యూఢిల్లీ: ట్యాక్సీల్లో  ప్రయాణించడం మహిళలకు అంత సురక్షితం కాదని  కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ట్యాక్సీ డ్రైవర్లతో గతంలో పలుమార్లు చర్చించినా ప్రయోజనం లేకుండాపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు.

ట్యాక్సీల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళల పట్ల డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించడం, రేప్‌లకు పాల్పడడం లాంటి ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. దీంతో క్యాబ్‌లు కూడ అంత సురక్షితం కాదనిమేనకాగాంధీ అభిప్రాయపడ్డారు.

మహిళల రక్షణ కోసం క్యాబ్ సర్వీసు కంపెనీలు అన్ని భద్రత పరమైన మార్గదర్శకాలను పాటించేలా చూడాలని  ఆమె ఆ లేఖలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.  క్యాబ్ డ్రైవర్లతో పలు మార్లు చర్చలు జరిపినా  ఫలితం లేకుండా పోయిందని  ఆమె చెప్పారు.

 ముఖ్యంగా ట్యాక్సీ డ్రైవర్లకు పోలీసుల వెరిఫికేషన్‌ క్యాబ్‌లలోని సెంట్రల్‌ లాక్‌ను తొలగించాలని కోరినా వారు స్పందించలేదన్నారు. అందుకే ఈ విషయాన్ని రవాణా శాఖ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఇటీవల బెంగళూరులో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. క్యాబ్‌లో ఒంటరిగా ఉన్న తనను బెదిరించి దుస్తులు విప్పించాలని చూసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో మేనకాగాంధీ పై విధంగా స్పందించారు.

click me!