చెన్నైలో చక్కర్లు కొడుతున్న 'బుజ్జి' ! ప్రభాస్ కల్కిలో ఉపయోగించిన ఫ్యూచరిస్టిక్ కారు ఇదే!

By Ashok kumar Sandra  |  First Published May 30, 2024, 2:37 PM IST

ఆన్‌లైన్‌లో నెటిజన్లను కట్టిపడేసిన బుజ్జి.. ఈసారి చెన్నై రోడ్లపై పరిగెడుతూ పలువురిని ఆశ్చర్యపరిచింది. కల్కి 2898 AD నిర్మాతలు ఈ సినిమాని  ప్రమోట్ చేయడానికి బుజ్జితో కలిసి దేశవ్యాప్త పర్యటనకి  ప్లాన్ చేస్తున్నారు.
 


కల్కి 2898 ADలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె సహా పలువురు టాప్  స్టార్స్ నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని బుజ్జి అనే హైటెక్ రోబోకార్, సినిమాపై అందరి దృష్టిని ఆకర్షించింది. దీని అద్భుతమైన డిజైన్ అందరినీ ఆకట్టుకుంది కూడా.

భారతీయ సినిమా కల్కి 2898 ADలో మొదటిసారిగా  ఈ సూపర్‌కార్ బుజ్జి కనిపించనుంది. ఈ కారుకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.  ఈ సినిమా విడుదలకు మరికొద్ది వారాలు మాత్రమే ఉండగా, ఇప్పటికే బుజ్జితో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

Latest Videos

ఆన్‌లైన్‌లో నెటిజన్లను కట్టిపడేసిన బుజ్జి.. ఈసారి చెన్నై రోడ్లపై పాకుతూ పలువురిని ఆశ్చర్యపరిచింది. కల్కి 2898 AD నిర్మాతలు ఈ సినిమాని  ప్రమోట్ చేయడానికి బుజ్జితో కలిసి దేశవ్యాప్త పర్యటనకి ప్లాన్ చేస్తున్నారు.

అయితే హైదరాబాద్‌లో హీరో ప్రభాస్ స్వయంగా ఈ కారుని నడిపారు. ఆ తర్వాత బుజ్జి ఇప్పుడు చెన్నైకి చేరింది. చెన్నై రద్దీగా ఉండే రోడ్లపై బుజ్జి పాకుతున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

   టాలీవుడ్ హీరో నాగ చైతన్య, భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా వన్ కారు డ్రైవర్ నరైన్ వంటి చాలా మంది ప్రముఖులు ఈ బుజ్జి కారుని  నడిపారు.

ఈ బుజ్జి కారు మామూలు కార్ కాదు. బుజ్జి కల్కి సినిమాలో ప్రభాస్ సన్నిహితుడి పాత్రలో కనిపించనుంది. ప్రోమోలో ప్రభాస్, బుజ్జీల సన్నివేశాలు కూడా ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టాయి.

బుజ్జి కల్కి సినిమా ప్రమోషన్స్ కోసమే కాకుండా వెబ్ సిరీస్ కూడా రాబోతోంది. కల్కి మేకర్స్ మే 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'బుజ్జి అండ్  భైరవ' పేరుతో స్పెషల్ ప్రివ్యూని విడుదల చేయబోతున్నారు.

 

, One of the SuperStar from Team - Making an Huge Presence at the streets of CHENNAI 😍🥵🔥 pic.twitter.com/zqGCn3Q10V

— Prabhas Network™ (@PrabhasNetwork_)
click me!