బిఎమ్‌డబ్ల్యూ కొత్త స్పోర్ట్స్ బైక్‌.. కే‌టి‌ఎం, కావాసకికి పోటీగా లాంచ్.. హైలెట్ ఫీచర్స్ ఇవే..

By asianet news teluguFirst Published Jul 16, 2022, 12:47 PM IST
Highlights

కొత్త కలర్ స్కీమ్ మినహా ఈ బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. బైక్ కి అదే 313cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌, 33.5bhp పవర్ 28Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ స్ట్రీట్ నేకెడ్ 2022 బైక్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్ చేసిన తర్వాత బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇప్పుడు  కొత్త బైక్‌ను రూ. 2.70 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర  పాత మోడల్ కంటే రూ. 5,000 ఎక్కువ. కొత్త ఆన్యువల్ అప్‌డేట్‌తో బైక్ కొత్త కలర్ ఆప్షన్స్ లో విడుదల చేసింది. ఈ బైక్ ఇప్పుడు మూడు కలర్స్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది - రేసింగ్ బ్లూ, రేసింగ్ రెడ్ అండ్ కాస్మిక్ బ్లాక్. 

కొత్త కలర్ స్కీమ్ మినహా ఈ బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. బైక్ కి అదే 313cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌, 33.5bhp పవర్ 28Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అడ్వెంచర్ టూరింగ్ బైక్  G310GS బైక్ లో కూడా ఇదే ఇంజన్ ఉపయోగించారు.

2022 BMW G310R స్ట్రీట్ నేకెడ్ బైక్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ముందు భాగంలో USD, వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్‌తో వస్తాయి. బ్రేకింగ్ కోసం రెండు వీల్స్ లో సింగిల్ డిస్క్ ఉపయోగించారు. 

బైక్ డ్యూయల్ ఛానెల్ ABSని పొందుతుంది, ఈ ఫీచర్ దాని భద్రతను పెంచుతుంది అలాగే బైక్  స్టాండర్డ్ కిట్‌లో భాగం. ఇతర ముఖ్య ఫీచర్స్ గురించి మాట్లాడితే  బైక్ పూర్తి-LED లైటింగ్ సిస్టమ్, అడ్జస్ట్ చేయగల క్లచ్, బ్రేక్ లివర్లు, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. 

రెడ్ కలర్ ఫ్రేమ్ అండ్ వీల్స్ రెడ్ అండ్ వైట్ కలర్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి, ఈ ఫీచర్ ఈ బైకుని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. స్టైలింగ్ పరంగా  బిగ్-డాడీ S 1000 R సూపర్ నేకెడ్ స్క్వాటింగ్ స్టాన్స్, లో-స్లంగ్ హెడ్‌ల్యాంప్‌లు, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ సెక్షన్, రేక్డ్ అండ్ స్టబ్బి టెయిల్ సెక్షన్‌తో ప్రేరణ పొందింది. 

కొత్త 2022 G310R లాంచ్‌తో BMW Motorrad భారత మార్కెట్లో KTM 390 డ్యూక్, కవాసకి Z400 వంటి బైక్‌లతో పోటీ చేస్తోంది. కంపెనీ కొత్త G 310 RR, G 310 R  ఫుల్-ఫెయిర్డ్ వెర్షన్‌ను శుక్రవారం ఇండియాలో విడుదల చేసింది. ఈ బైక్ ధర దాదాపు 2.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.
 

click me!