BMW X3: ఇండియాలో ఎక్స్3 ఎస్‌యూ‌వి డీజిల్ వేరియంట్‌ను లాంచ్ చేసిన బి‌ఎం‌డబల్యూ.. టాప్ స్పీడ్, ధర ఎంతంటే?

By asianet news telugu  |  First Published Feb 18, 2022, 12:17 PM IST

బి‌ఎం‌డబల్యూ భారతదేశంలో కొత్త ఎక్స్3 డీజిల్ వేరియంట్‌ను విడుదల చేసింది. లగ్జరీ ఎడిషన్‌గా పరిచయం చేయబడిన ఈ  కొత్త బి‌ఎం‌డబల్యూ X3 xDrive20d స్థానికంగా బి‌ఎం‌డబల్యూ గ్రూప్ ప్లాంట్ చెన్నైలో ఉత్పత్తి చేయబడింది. ఈ కారు ఇప్పటికే ఉన్న రెండు పెట్రోల్ వేరియంట్‌లకు అదనంగా నేటి నుండి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.


లగ్జరీ కార్ల తయారీలో ప్రసిద్ధి చెందిన జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బి‌ఎం‌డబల్యూ (BMW) గురువారం డీజిల్ వేరియంట్‌  ఎక్స్3 (X3) SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త కారు ఎక్స్-షోరూమ్ ధరను రూ.65.50 లక్షలుగా ఉంచారు. దీనిని చెన్నైలోని కంపెనీ ప్లాంట్‌లో ఇండియాలో స్థానికంగా తయారు చేయబడింది. నేటి నుండి ఇప్పటికే ఉన్న పెట్రోల్ ట్రిమ్‌లతో పాటు అధికారిక బి‌ఎం‌డబల్యూ  డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. 

ధరల పరంగా కొత్త BMW X3 xDrive20d ట్రిమ్ టాప్-స్పెక్ X3 xDrive30i M స్పోర్ట్ ధరకు దగ్గరగా ఉంది, దీని ధర రూ. 65.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).  X3 xDrive30i SportX Plus ట్రిమ్ ధర రూ.59.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. 

Latest Videos

undefined

ఇంజిన్ పవర్ అండ్ స్పీడ్ 
కొత్త బి‌ఎం‌డబల్యూ ఎక్స్3 డీజిల్  ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీతో మరింత శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌తో పాటు రిఫ్రెష్ చేయబడిన  డిజైన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 2.0-లీటర్ 4-సిలిండర్ డీజిల్ యూనిట్,  140 kW / 190 hp శక్తిని ఇంకా 1,750 rpm- 2,500 rpm వద్ద 400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 213 కి.మీ. దీనితో పాటు ఈ కారు కేవలం 7.9 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు. 

కలర్ ఆప్షన్‌లు
లగ్జరీ ఎడిషన్‌గా పరిచయం చేసిన  కొత్త  బి‌ఎం‌డబల్యూ X3 xDrive20d ఎక్స్ టిరియర్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, బ్రూక్లిన్ గ్రే, సోఫిస్టో గ్రే, బ్లాక్ సఫైర్, కార్బన్ బ్లాక్ వంటి రంగులు ఉన్నాయి. 

కంపెనీ సర్వీస్
కారు 'బి‌ఎం‌డబల్యూ సర్వీస్ ఇన్‌క్లూజివ్' అండ్ 'బి‌ఎం‌డబల్యూ సర్వీస్ ఇన్‌క్లూజివ్ ప్లస్' వంటి ఆప్షనల్ కంపెనీ సేవలతో అందుబాటులోకి వచ్చింది. ఈ సర్త్విస్ ప్యాకేజీలు కండిషన్ బేస్డ్ సర్వీస్ (CBS), 3 సంవత్సరాలు / 40,000 kms నుండి 10 సంవత్సరాల / 2,00,000 kms వరకు ఉండే మెయింటెనెన్స్ వర్క్‌లను కవర్ చేస్తాయి. ఈ సర్వీస్ ధర కిలోమీటరుకు రూ.1.53 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి అదనంగా కొత్త X3 SUV ఆప్షనల్ బి‌ఎం‌డబల్యూ రిపేర్ ఇన్‌క్లూసివ్‌తో కూడా అందుబాటులో ఉంది.

click me!