బజాజ్ పల్సర్ NS200 అడ్వెంచర్ ఎడిషన్

By Sandra Ashok KumarFirst Published Dec 10, 2019, 12:58 PM IST
Highlights

గత సంవత్సరం ఇస్తాంబుల్ మోటర్‌బైక్ షోలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 అడ్వెంచర్ ఎడిషన్ ఇతర స్టాండర్డ్ వేరియంట్లతో పాటు RS200, NS160, డొమినార్ 400, బజాజ్ V15 బైకులను కూడా అధికారికంగా ప్రదర్శించారు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 అడ్వెంచర్ ఎడిషన్ గత సంవత్సరం ఇస్తాంబుల్ మోటర్‌బైక్ షోలో అధికారికంగా ప్రదర్శించారు. మోటారుసైకిల్ ప్రదర్శనలో బజాజ్ లైనప్ నుండి ఇతర స్టాండర్డ్ వేరియంట్లతో పాటు RS200, NS160, డొమినార్ 400, బజాజ్ V15 బైకులు కూడా ఉన్నాయి.


NS200 బైక్ యాక్సెసరైజ్డ్ మోడల్‌లో హెడ్‌ల్యాంప్ కవర్, ఇంజిన్ గార్డ్, రిమువబుల్ మౌంట్‌లతో కూడిన లగేజ్ క్యారియర్లు, అల్యూమినియం ఇన్సర్ట్‌లు, హాండ్ గార్డ్‌లు, ప్రత్యేక మౌంట్‌తో నావిగేషన్ డివైజ్  దీనికి అమర్చారు. ప్రస్తుతం పల్సర్ ఎన్ఎస్ 200 కోసం భారతదేశంలో ఈ అసెసోరిఎస్ లాంచ్ చేయడానికి బజాజ్ అధికారిక ప్రణాళికలు లేవు, అయితే కస్టమైజేషన్ షాప్ నుండి ఈ రకమైన మోడిఫికేషన్ చేసుకోవచ్చు.

also read స్టాక్స్ క్లియరెన్స్ సేల్... కార్లపై డిస్కౌంట్ ఆఫర్ల వర్షం


పల్సర్ ఎన్ఎస్ 200 అడ్వెంచర్ బైక్ పల్సర్ ఎఎస్ 200 ఒకే విధముగా ఉంటాయి, అయితే పల్సర్ ఎఎస్ 200 మోడల్  నిలిపివేయబడినది. NS200 తో పోల్చితే ఇది తేలికపాటి అడ్వెంచర్ మెషీన్ బైక్, పల్సర్ అభిమానులు AS200 లో అడ్జస్ట్ చేయగల విండ్‌స్క్రీన్, గ్రౌండ్ క్లియరెన్స్  ఇంకా రోడ్ గ్రిప్ కోసం మంచి టైర్లు వంటి ఫీచర్స్ పొందుతారని ఊహించారు.

కానీ బజాజ్ ఆటో AS200 ను NS200 నుండి వేరు చేయడానికి ఫ్రంట్ విజర్,  సైడ్ ప్యానెల్స్‌ను మాత్రమే మార్పులు చేసి అందించింది. చివరికి భారత మార్కెట్లో AS200 అమ్మకాలు సరిగా లేకపోవడంతో బ్రాండ్ ఆ మోటార్‌సైకిల్‌ను నిలిపివేసింది. ఇటీవలి నివేదిక ప్రకారం బజాజ్ ఆటో AS సిరీస్ తిరిగి వస్తుందని తెలిపింది బజాజ్ పల్సర్ సిరీస్ అత్యంత అధునాతనమైనది.

also read యమహా కొత్త బి‌ఎస్-6 బైక్... అల్ న్యూ ఫీచర్స్

పల్సర్ ఎన్‌ఎస్ 200 అడ్వెంచర్ బైక్ యాక్సెసరైజ్డ్ మోడల్ దీనికి 199.5 సిసి ఇంజన్, ఫ్యుయెల్-ఇంజెక్ట్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 24.5 హెచ్‌పి గరిష్ట శక్తి, 18.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇండియా-స్పెక్ NS200 మోడల్ కార్బ్యురేటెడ్ 199.5 సిసి ఇంజిన్‌తో వస్తుంది. ఇది 23.5 హెచ్‌పి శక్తి, 18.3 ఎన్ఎమ్ టార్క్ కు అభివృది చేస్తుంది. దీని ఇంజిన్ కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేశారు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 చాలా కాలం విరామం తరువాత భారతదేశంలో తిరిగి దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం, ఇది భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్ట్రీట్ బైకులలో ఒకటి. సింగిల్-ఛానల్ ఎబిఎస్ వెర్షన్ 1.14 లక్షల రూపాయలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉండగా, బ్రాండ్ 2020 ప్రారంభంలో భారతదేశంలో ఫ్యుయెల్ ఇంజెక్ట్ చేసిన బిఎస్ 6 వెర్షన్‌ను లాంచ్ చేయాలని యోచిస్తోంది.
 

click me!