కొత్త లుక్ తో బజాజ్ పల్సర్ 180 (నేకెడ్) బైక్.. ఇప్పుడు మరింత స్టయిలిష్ గా అందుబాటులోకి..

By S Ashok KumarFirst Published Feb 18, 2021, 2:17 PM IST
Highlights

బజాజ్ పల్సర్ 180 (నేకెడ్) 2021ను కొత్త  లుక్ లో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బైక్ పాత మోడల్ కంటే లుక్‌లో చాలా మార్పులు చేసింది. అయితే కంపెనీ ప్రస్తుతం తన అధికారిక వెబ్‌సైట్‌లో బైక్‌ను జాబితా చేయలేదు. 

ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో  శక్తివంతమైన బైక్ బజాజ్ పల్సర్ 180 (నేకెడ్) 2021ను కొత్త  లుక్ లో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బైక్ పాత మోడల్ కంటే లుక్‌లో చాలా మార్పులు చేసింది.

అయితే కంపెనీ ప్రస్తుతం తన అధికారిక వెబ్‌సైట్‌లో బైక్‌ను జాబితా చేయలేదు. కంపెనీ డీలర్‌షిప్‌లో బైక్ బుకింగ్ అనధికారికంగా ప్రారంభమైంది. ఈ బైక్ డీలర్‌షిప్‌లో  డిస్ ప్లే కోసం ప్రదర్శించారు. అలాగే టెస్ట్ రైడ్ కూడా  అందిస్తున్నారు. 

ఫీచర్స్ 
కొత్త పల్సర్ 180 నేకెడ్ బైక్ బల్బ్ ఇండికేషన్ తో హాలోజన్ హెడ్‌ల్యాంప్, బైక్ వెనుక భాగంలో ఎల్‌ఈడీ టెయిల్ లాంప్,  మీటర్ కన్సోల్‌లో అనలాగ్ టాకోమీటర్, ఎల్‌సిడి స్క్రీన్ ఉంటుంది. ఇందులో బైక్  స్పీడ్, ఇంధన స్థాయి, ఓడోమీటర్ గురించి సమాచారం చూపిస్తుంది. 

also read మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ హైబ్రిడ్ ఎడిషన్.. దీని టాప్ స్పీడ్, ధర, ఫీచర్స్ మీకోసం.. ...

ఇంజన్
కొత్త 2021 బజాజ్ పల్సర్ 180 బైక్‌కు బిఎస్ -6 ఇంధన ఉద్గార ప్రమాణాలతో 180 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 పిఎస్, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు. ఈ బైక్ బరువు 145 కిలోలు అంటే సెమీ ఫెయిర్ మోడల్ కంటే 10 కిలోల తేలికైనది. 

సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్
 కొత్త పల్సర్ 180  రూపంలో మార్పు తప్ప మెకానికల్ గా ఏమీ మారలేదు. ఇంజన్ పరంగా, ఇది దాని సెమీ-ఫెయిర్డ్ మోడల్‌  పోలి ఉంటుంది. బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు లభిస్తాయి, వెనుక భాగంలో 5 అడ్జస్ట్ చేయగల గ్యాస్ ఛార్జ్డ్ షాక్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం బైక్ 280 ఎం‌ఎం  ఫ్రంట్ డిస్క్, 230 ఎం‌ఎం రియర్ డిస్క్ ఉంటుంది. బైక్  భద్రతా ఫీచర్స్ గురించి మాట్లాడితే  దీనికి సింగిల్-ఛానల్ ఎబిఎస్ ఉంది, ఇది స్టాండర్డ్ గా వస్తుంది.

ధర
 ముంబైలో ఈ బైక్  ఎక్స్-షోరూమ్ ధర రూ .1,04,768. ఇది పల్సర్ 180 ఎఫ్ కంటే రూ .10,000 తక్కువ, దీని ధర 1,14,003 రూపాయలు. 

లేజర్ బ్లాక్, న్యూక్లియర్ బ్లూ అనే రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది.  ఈ బైక్ అధికారికంగా భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180, హోండా హార్నెట్ 2.0 వంటి బైక్‌లతో పోటీ పడనుంది. 

click me!