అప్పుడు నిస్సాన్.. ఇప్పుడు హ్యుందాయ్.. ఉత్పత్తి నిలిపివేసి ఆలోచనలో కంపెనీ: రిపోర్ట్

By asianet news telugu  |  First Published Oct 18, 2022, 1:24 PM IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సమయంలోనే హ్యుందాయ్ మోటార్ ఈ ఏడాది మార్చిలో రష్యాలో కార్యకలాపాలను నిలిపివేసింది. కొరియన్ కార్ల తయారీ సంస్థ ఆగస్టు -సెప్టెంబర్ మధ్య కార్లను విక్రయించలేకపోయింది ఇంకా నష్టాలను కూడా ఎదుర్కొంటోంది.  


ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం మధ్య కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ త్వరలో రష్యా నుండి నిష్క్రమించనుంది. రష్యా -ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఈ సంవత్సరం రష్యాలో ఆటోమొబైల్ పరిశ్రమ వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఓ వార్తా సంస్థ నివేదిక ప్రకారం హ్యుందాయ్ రష్యాలో కార్యకలాపాలను పూర్తిగా మూసివేయనున్నట్లు అలాగే అక్కడి తయారీ ప్లాంట్‌ను కూడా విక్రయించనుందని తెలిపింది.  

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సమయంలోనే హ్యుందాయ్ మోటార్ ఈ ఏడాది మార్చిలో రష్యాలో కార్యకలాపాలను నిలిపివేసింది. కొరియన్ కార్ల తయారీ సంస్థ ఆగస్టు -సెప్టెంబర్ మధ్య కార్లను విక్రయించలేకపోయింది ఇంకా నష్టాలను కూడా ఎదుర్కొంటోంది.  

Latest Videos

undefined

 కొరియన్ మీడియా ప్రకారం, హ్యుందాయ్ "కష్టమైన పని వాతావరణం కారణంగా రష్యాలో భవిష్యత్తు అవకాశాలను" విశ్లేషిస్తోంది. హ్యుందాయ్ మోటార్ కి రష్యాలో సంవత్సరానికి 2 లక్షల వాహనాల ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాని మొత్తం ఉత్పత్తిలో రష్యా దేశం నాలుగు శాతం వాటాను అందిస్తుంది. రష్యా నుంచి కంపెనీ వైదొలగడం హ్యుందాయ్‌కు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, హ్యుందాయ్ అండ్ కియా దాదాపు 315 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,584 కోట్లు) నష్టపోవచ్చు. 

కార్ల తయారీ సంస్థ రష్యాను విడిచిపెట్టడానికి ప్రధాన కారణాలు హై-టెక్ ఎక్విప్మెంట్స్ లేకపోవడం ఇంకా రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడం, ఇది తీవ్రమైన ఉత్పత్తి కోతలకు లేదా ఉత్పత్తి ఆగిపోవడానికి దారితీసింది. తాజాగా జపనీస్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ రష్యాలో కంపెనీ ప్లాంట్‌ను అధికారికంగా  నిష్క్రమణను ప్రకటించే ముందు త్రో ఆవే ధరలకు కార్లను విక్రయించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న మాస్కో సాయుధ బలగాలను ఉక్రెయిన్‌కు పంపినప్పటి నుండి రెనాల్ట్ వంటి ఎన్నో ఇతర వాహన తయారీ సంస్థలు  రష్యాను విడిచిపెట్టాయి. 

గత వారం నిస్సాన్ మోటార్ రష్యాలో వ్యాపారాన్ని కేవలం €1కి ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీకి అప్పగించాలని నిర్ణయాన్ని ప్రకటించింది. రష్యా నుండి నిష్క్రమించడంతో జపాన్ కార్ల తయారీ సంస్థ సుమారు $687 మిలియన్లను (సుమారు రూ. 6,535 కోట్లు) కోల్పోతుంది.

click me!