రెజ్వానీ వెంజియన్స్‌లో కొలిజన్ అలెర్ట్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, ఆఫ్ గ్రిడ్ సోలార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవిలో ఆర్మీ వాహనం వంటి ఫీచర్స్ తో ఇంజిన్ కూడా చాలా శక్తివంతమైనది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో రెజ్వానీ అనే కంపెనీ ఒక స్పెషల్ ఎస్‌యూవిని లాంచ్ చేసింది. Rezvani Vengeance పేరుతో ఈ ఎస్‌యూవిలో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్స్ ఆర్మీ ట్యాంక్స్ లో ఉంటాయి. ఈ SUV ఫీచర్లు ఇంకా ధర గురించి మీకోసం..
ఫీచర్లు
రెజ్వానీ వెంజియన్స్‌లో కొలిజన్ అలెర్ట్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, ఆఫ్ గ్రిడ్ సోలార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి కాకుండా, మిలిటరీ గ్రేడ్ ప్యాకేజీలో ఈ SUV బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అండ్ బాడీ ఆర్మర్, అండర్ సైడ్ ఎక్స్‌ప్లోజివ్ ప్రొటెక్షన్, స్మోక్ స్క్రీన్, ఫ్లాట్ రన్ మిలిటరీ టైర్లు, థర్మల్ నైట్ విజన్ సిస్టమ్, రీ-ఫోర్స్ సస్పెన్షన్ సిస్టమ్, ఎలక్ట్రో మాగ్నెటిక్ పల్స్ ప్రొటెక్షన్, రామ్ బంపర్‌లను పొందుతుంది, పేలుడు పరికరాన్ని గుర్తించే ఆప్షన్ ఇంకా బుల్లెట్ ప్రూఫ్ జ్యాకెట్ అండ్ హెల్మెట్, ఎలక్ట్రిఫైడ్ డోర్ హ్యాండిల్, ఇంటర్‌కామ్ సిస్టమ్, గ్యాస్ మాస్క్ వంటివి ఆర్మీ వాహనం లేదా ట్యాంక్‌లో కనిపించే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి.
undefined
ఇంజిన్ పవర్
ఈ ఎస్‌యూవిలో ఆర్మీ వాహనం వంటి ఫీచర్స్ తో ఇంజిన్ కూడా చాలా శక్తివంతమైనది. ఇందులో కంపెనీ మూడు ఇంజన్ల ఆప్షన్స్ ఇచ్చింది. వీటిలో సూపర్ఛార్జ్ 6.2-లీటర్ V8 ఇంజిన్ 420 హార్స్‌పవర్, 4100 rpm వద్ద 623 న్యూటన్ మీటర్ల టార్క్, రెండవ ఆప్షన్ 6.2-లీటర్ V8 ఇంజన్ ఆప్షన్ అందిస్తుంది. మూడవ ఇంజిన్ ఆప్షన్ 3.0L Duramax ఇంజిన్. ఈ ఇంజన్ 1500 rpm వద్ద 277 హార్స్‌పవర్, 460 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో ఏడు అండ్ ఎనిమిది మంది కూర్చునే అవకాశం ఉంది.
ప్రత్యేకంగా ఇంటీరియర్
ఈ SUV లోపలి భాగంలో చాలా లగ్జరీ టచ్ ఇచ్చారు. 12-వే పవర్ ఫ్రంట్ సీట్లు అలాగే హీటెడ్ సీట్లు పొందుతుంది. ఇవి కాకుండా హీటెడ్ స్టీరింగ్ వీల్, మెమరీ సీట్లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఐయోనైజర్ ఎయిర్ క్లీనర్, రెయిన్ సెన్స్ వైపర్స్, రిమోట్ స్టార్ట్, 19 స్పీకర్లతో కూడిన అద్భుతమైన టచ్ OLED ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా అందించారు.
ధర ఎంత
ఏదైనా ఎస్‌యూవి పవర్ ఫుల్ ఇంజిన్, గొప్ప ఫీచర్లు, మిలిటరీ గ్రేడ్ వంటి ఫీచర్స్ పొందినట్లయితే దాని ధర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కంపెనీ ఈ ఎస్‌యూవి ప్రారంభ ధరను యూఎస్ $2.5 లక్షలగా నిర్ణయించింది, అంటే భారతీయ రూపాయలలో దాదాపు రూ. 2.04 కోట్లు. దీని గరిష్ట ధర రూ. 5.17 కోట్ల వరకు ఉంటుంది.