బైక్ కొనాలనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేయండి.. ఎందుకంటే ఏప్రిల్‌ 1 నుంచి..

By S Ashok Kumar  |  First Published Mar 24, 2021, 2:05 PM IST

 పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల కారణంగా వచ్చే నెల నుండి బైకులు, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. కంపెనీ ఒక ప్రకటనలో  హీరో మోటోకార్ప్  బైకులు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరల పెంపు 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది." అని తెలిపింది. 


దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్  వాహన ప్రియులకు షాకిచ్చింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల కారణంగా వచ్చే నెల నుండి బైకులు, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది.

కంపెనీ ఒక ప్రకటనలో  హీరో మోటోకార్ప్  బైకులు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరల పెంపు 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది." అని తెలిపింది. పెరిగిన వస్తువుల వ్యయాల ప్రభావాన్ని పాక్షికంగా పూడ్చడానికి ధరల పెరుగుదల అవసరమని కంపెనీ తెలిపింది. 

Latest Videos

undefined

వినియోగదారుల మీద తక్కువ భారం పడేలా, తమ ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్టు హీర మోటో తెలిపింది. అయితే ధరల పెరుగుదల పరిమాణంపై కంపెనీ నిర్దిష్ట వివరాలు ఇవ్వలేదు.  కానీ, ఈ పెరుగుదల రూ .2500 వరకు ఉంటుందని, మోడల్, నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ఉంటుందని హీరో తెలిపింది.

also read  

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ధరల పెంపును  ప్రకటించిన ఒక రోజు తర్వాత హీరో మోటోకార్ప్  ధరల పెంపు ప్రకటన చేసింది.

గత సంవత్సరంలో వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల ధర ప్రతికూలంగా ప్రభావితమైందని మారుతి తెలిపింది. ఈ ధరల పెరుగుదల వివిధ మోడళ్ల బట్టి మారుతూ ఉంటుంది. మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో వాహనాల ధరలను రూ .34,000 వరకు పెంచింది.

నిస్సాన్ ఇంకా  డాట్సన్ కూడా ఏప్రిల్ 1 నుండి వాటి కార్ల ధరలను పెంచనున్నాయి. నేడు హీరో మోటోకార్ప్ స్టాక్ రూ .6.65 (0.12 శాతం) వద్ద ట్రేడవుతోంది.
 

click me!