మార్కెట్లోకి రిలీజ్ కాకముందే ఈ బైక్‌ను కొనేందుకు 40వేలకి పైగా క్యూ.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

By asianet news teluguFirst Published Jun 14, 2023, 4:30 PM IST
Highlights

ప్రస్తుతం, Aira 5,000 అండ్ 5,000 ప్లస్ అనే రెండు వేరియంట్‌లలో వస్తుంది. రెండూ ఒకే ఎలక్ట్రిక్ మోటార్ అండ్ బ్యాటరీ ప్యాక్‌ని పొందుతాయి. వాటి ధరలు రూ.1.74 లక్షలు నుండి  రూ.1.84 లక్షలు ఉంటుంది. 

అహ్మదాబాద్‌కు చెందిన స్టార్టప్ మేటర్ తాజాగా ఎయిరా(Aira) ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్‌కు నెల రోజుల్లోనే 40,000 బుకింగ్‌లు వచ్చాయని మేటర్ తెలిపింది. Aira భారతదేశపు మొట్టమొదటి గేర్ ఎలక్ట్రిక్ బైక్. ప్రస్తుతం, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్‌లను అంగీకరిస్తోంది. 

ప్రస్తుతం, Aira 5,000 అండ్ 5,000 ప్లస్ అనే రెండు వేరియంట్‌లలో వస్తుంది. రెండూ ఒకే ఎలక్ట్రిక్ మోటార్ అండ్ బ్యాటరీ ప్యాక్‌ని పొందుతాయి. వాటి ధరలు రూ.1.74 లక్షలు నుండి  రూ.1.84 లక్షలు ఉంటుంది. మేటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ లిక్విడ్ కూల్డ్, ఐదు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ పరిధి 125 కి.మీ అని కంపెనీ పేర్కొంది.

ఇందులో 10.5kW లిక్విడ్ కూల్డ్ మోటార్ ఉంది. ఫోర్ -స్పీడ్ మాన్యువల్ గేర్  ట్రాన్స్‌మిషన్‌తో ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేసిన మొదటి బైక్ కూడా ఇది. దీనిని గేర్‌లతో కూడిన మొదటి ఎలక్ట్రిక్ బైక్  అని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఎయిర్ కూలింగ్‌కు బదులుగా లిక్విడ్ కూలింగ్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Aira అని కంపెనీ పేర్కొంది. 

ఈ ఎలక్ట్రిక్ బైక్ బరువు 180 కిలోలు. బ్యాటరీ ప్యాక్ దాదాపు 40 కిలోల బరువు ఉంటుంది. ఇందులో ఫర్-స్పీడ్ గేర్‌బాక్స్ కలదు. ఎలక్ట్రిక్ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీని ఇంకా కాల్/మెసేజ్ అలర్ట్‌తో కూడిన ఆన్‌బోర్డ్ నావిగేషన్ డిస్‌ప్లేను పొందే ఏడు-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బైక్ ఆకర్షణకు జోడిస్తుంది.

బైక్ ముందుకు ఇంకా రివర్స్ అసిస్ట్‌తో పాటు పుష్-బటన్ స్టార్ట్‌ను పొందుతుంది. బ్రేకింగ్ డ్యూటీస్ డ్యూయల్-ఛానల్ ABSతో పాటు రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌ల ద్వారా హ్యాండిల్ చేయబడుతుంది.

click me!