ఒక నివేదిక ప్రకారం, దుబాయ్ పోలీసులు క్రైమ్-ఫైటింగ్ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి ఘియాత్ పెట్రోల్ ఎస్‌యూవి 400 యూనిట్లను ప్రవేశపెట్టనుంది. ఘియాత్ ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత సామర్థ్యం గల పోలీసు వాహనాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
దుబాయ్ పోలీసులు ప్రపంచంలోని అత్యంత వేగవంతమైనవి, విలాసవంతమైనవి, శక్తివంతమైన వాహనాలు తమ ఫ్లీట్‌లో ఉన్నాయని పేర్కొంది. దుబాయ్ పోలీస్ ఫోర్స్‌లో ఫెరారీ (ferrari), బుగట్టి (buggati), లంబోర్ఘిని (lambhorgini) మోడల్‌ల నుండి బెంట్లీ (bently), రోల్స్ రాయిస్ (rolls royce), మెర్సిడెస్ (mercedes) వరకు కార్లు ఉన్నాయి. ఇప్పుడు దుబాయి పోలీస్ ఫోర్స్ వచ్చే ఐదేళ్లలో 400 స్మార్ట్ పెట్రోల్ వాహనాలను వారి ఫ్లీట్‌లోకి చేర్చనుంది. ఈ వాహనాలు Ghiath SUVలు, వీటిని పూర్తిగా UAEలో డబల్యూ మోటార్స్ (W Motors) నిర్మించనుంది.
ఒక నివేదిక ప్రకారం, దుబాయ్ పోలీసులు క్రైమ్-ఫైటింగ్ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి ఘియాత్ పెట్రోల్ ఎస్‌యూవి 400 యూనిట్లను ప్రవేశపెట్టనుంది. ఘియాత్ ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత సామర్థ్యం గల పోలీసు వాహనాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
undefined
Dh196 మిలియన్ల (దాదాపు 53.3 మిలియన్ల డాలర్లు) వెహికల్స్ తాజా బ్యాచ్ దేశంలో పూర్తిగా తయారు చేయబడిన మొదటి బ్యాచ్ అవుతుంది. దుబాయ్ పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా అల్ మేరీ మాట్లాడుతూ, "మేము ఇంకా డబ్ల్యు మోటార్స్ మొబిలిటీ రంగంలో తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని దుబాయ్‌లో అత్యున్నత స్థాయి ప్రజా భద్రతను నిర్ధారించడంలో ఉమ్మడి దృష్టితో ఉన్నాము. అలాగే వాటిని ఉపయోగించడానికి ఎదురుచూస్తున్నాము" అని అన్నారు.
ఘియాత్‌కు ప్రత్యేకత ఏమిటి?
Ghiath SUV 2018 నుండి దుబాయ్ పోలీస్ ఫ్లీట్‌లో భాగం. ఇంకా దుబాయ్ పోలీసుల ప్రధాన కమాండ్ గదికి అనుసంధానించిన అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ ఈ వాహనం లో ఉంది. ఈ వాహనం ప్రత్యేకమైన విషయం ఏంటంటే చాలా దూరం నుండి కూడా అనుమానాస్పదంగా కనిపించే కార్లను నిరంతరం ట్రాక్ చేయగలదు.
దీనిలో AI, సెక్యూరిటీ ఫోర్‌కాస్టింగ్ అండ్ క్రైమ్ రెస్పాన్స్‌లో ప్రత్యేకత ఉన్న సేఫ్ సిటీ గ్రూప్ సహాయంతో అభివృద్ధి చేయబడిన ఒక కృత్రిమ వ్యవస్థ కూడా ఉంది. ఇతర ఫీచర్స్ లో 360-డిగ్రీ పెరిస్కోప్ కెమెరా, ఎనిమిది ఎక్స్ టిరియర్ నిఘా కెమెరాలు, ఫేస్ అండ్ లైసెన్స్ ప్లేట్ గుర్తింపు సిస్టమ్ ఉన్నాయి. క్యాబిన్ లోపల 16-అంగుళాల మెయిన్ స్క్రీన్ కూడా ఉంది. ఈ వాహనానికి 4.0-లీటర్ V6 అండ్ 5.6-లీటర్ V8 అనే రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి.