యాక్సిడెంట్‌ పై హెచ్చరించే వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్

By Rekulapally SaichandFirst Published Oct 27, 2019, 11:06 AM IST
Highlights

ఐదు హైబ్రీడ్ పవర్ ట్రైన్ ఆప్షన్లతో వినియోగదారుల ముంగిట్లోకి వస్తోంది వోక్స్ వ్యాగన్. కారు 2 ఎస్ పేరుతో గల ఫీచర్ అమర్చడంతో ముందుగా వచ్చే ప్రమాదం గురించి మనను అలర్ట్ చేస్తుందీ కారు.
 

న్యూఢిల్లీ: భవిష్యత్ తరం అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుని జర్మనీ ఆటో మేజర్ వోక్స్ వ్యాగన్ సరికొత్త గోల్ఫ్ మోడల్ కార్లను విపణిలోకి తీసుకురానున్నది. 2020 దశకం అవసరాలకు అనుగుణంగా ఈ కారును రూపొందించారు. అత్యాధిక టెక్నాలజీతో డిజిటల్ హంగులను పొందుపరిచారు. 

దాదాపు క్యాబిన్‌ను బటన్ లెస్‌గా మార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఎనిమిదో తరం కారు మొత్తం ఐదు హైబ్రీడ్ వేరియంట్లలో అందుబాటులోకి రానున్నది. చూడటానికి పాత తరం గోల్ఫ్ మోడల్ కార్లనే ఇది తలపిస్తున్నా డిజైన్‌లో మాత్రం పలు మార్పులు తీసుకువచ్చారు. 

మొత్తం కారు పొడవు 26 మిల్లీ మీటర్లు పెంచి 4,284 మిల్లీ మీటర్లుగా, 10 మిల్లిమీటర్ల వెడల్పు తగ్గించి 1789 మిల్లీ మీటర్లకు తగ్గించారు. డబుల్ బ్యారెల్ ఎల్ఈడీ లైట్లతో ఈ కారును మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. మధ్యలో ఎయిర్ డ్యామ్, చివరిలో బాడీ కలర్డ్ యాక్సెంట్లతో ఉన్న బంపర్ కొత్త లుక్‌ను అందిస్తోంది. 

దీనిలో ప్రమాదాన్ని ముందే పసిగట్టే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం గమనార్హం. కార్2 ఎక్స్ పేరుతో వస్తున్న ఈ ఫీచర్ ప్రమాదాల్నిముందే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇక 10.25 అంగుళాల డిజిట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తోపాటు 8.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10 అంగుళాల ప్రత్యామ్నాయ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉండేలా రూపొందించారు. 

శామ్‌సంగ్ లోని కొన్ని స్మార్ట్ ఫోన్ల మోడళ్లను దీనికి అనుసంధానించే సౌకర్యం ఉంది. తలుపు తెరవడానికి, ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ఫోన్‌ని ‘కీ’గా వాడుకోవచ్చు. మొత్తం ఐదు వేరియంట్లలో మూడింటిని 48 వోల్డ్ మైల్డ్ హైబ్రీడ్ సిస్టంతోపాటు టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌ని జత చేశారు. 

వీటిలో 109 బీహెచ్పీ, 129 బీహెచ్పీ, 241 బీహెచ్పీ శక్తిని విడుదల చేసే ఫ్లగ్ ఇన్ హైబ్రీడ్ మోడళ్లు. వీటికి తోడు 89 బీహెచ్పీ, 109 బీహెచ్పీ శక్తిని విడుదల చేసే ఒక లీటర్ టర్బో త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, 114 బీహెచ్పీ, 148 బీహెచ్పీ శక్తిని విడుదల చేసేలా 1.5 లీటర్ టర్బో ఫోర్ సిలిండర్ ఇంజన్ కూడా రానున్నది. అలాగే 114 బీహెచ్పీ, 148 బీహెచ్పీ శక్తిని విడుదల చేసే డీజిల్ ఫోర్ సిలిండర్ వేరియంట్లు కూడా ఉన్నాయి. 

click me!