బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్ : KTM 390 అడ్వెంచర్ 2020

Published : Nov 06, 2019, 02:03 PM ISTUpdated : Nov 06, 2019, 02:15 PM IST
బైక్ లవర్స్ కి  గుడ్ న్యూస్ : KTM 390 అడ్వెంచర్ 2020

సారాంశం

2020 KTM 390 అడ్వెంచర్ కే‌టి‌ఎం బ్రాండ్ యొక్క చాలా ముఖ్యమైన ఉత్పత్తి. ఇది భారతదేశంలో తయారు చేసి  ప్రపంచవ్యాప్తంగా దీనిని ఎగుమతి చేయబడుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని భారత్‌లో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని అంచనాలు.  

అనేక సంవత్సరాలుగా బైక్  ఔత్సాహికులకు ఫేవరేట్ లిస్ట్ లో భాగమైన KTM బైక్స్ మంచి జనాదరణ, అధిక రేటింగ్ పొంది మంచి పేరు తెచ్చుకుంది. కంపెనీ చెప్పినట్లుగా ఇప్పుడు కొత్త 390 అడ్వెంచర్ ను త్వరలో మార్కెట్లోకి తిసుకురానుంది. ఇది KTM 790 అడ్వెంచర్ బైక్ వలె లక్షణాలను, ఫిచుర్స్ ని కలిగి ఉంటుంది.  


 2020 KTM 390 అడ్వెంచర్ డిజైన్ పరంగా 790 అడ్వెంచర్‌కు చాలా పోలికలు కలిగి ఉంటయి. దీనికి ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్‌తో పాటు, పెద్ద మోటారుసైకిల్ నుండి పిన్సర్-రకం ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌ డిజైన్ ఒకేలా ఉంటుంది. దీనికి ముందు విండ్‌ స్క్రీన్ మరియు బైక్‌కు డిఫ్లెక్టర్ కూడా ఉంటుంది అలాగే డ్యూయల్ పర్పస్  అల్లాయ్ వీల్స్ టైర్స్ తో వస్తుంది.

 

KTM 390 అడ్వెంచర్ లో  స్ప్లిట్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌, బైక్ లైట్ ఆఫ్-రోడింగ్ సామర్ధ్యాలతో టూరర్‌గా పిచ్ చేయబడింది. దీని  సీట్ల ఎత్తు 858 మి.మీ భారతీయ రైడర్స్ కోసం కొంచెం ఎత్తుగా ఉంటుంది. పెద్ద హ్యాండిల్ బార్, రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్, నడపడానికి తేలికగా ఉంటుంది. సీటు చాలా సౌకర్యవంతంగా, పిలియన్ సీటు కూడా వెడల్పుగా ఉండి ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు సౌకర్యంగా ఉంటుంది.

also read కియా ‘సెల్టోస్’ నో ‘హాల్టింగ్స్’: అక్టోబర్‌లో 12,800 సేల్స్


KTM 390 అడ్వెంచర్‌ కి  373 సిసి సింగిల్ సిలిండర్ మోటారు, 9000 ఆర్‌పిఎమ్, 43 బిహెచ్‌పిని అభివృద్ధి చేస్తుంది.  అయితే దీని టార్క్ 7000 ఆర్‌పిఎమ్, 37 ఎన్ఎమ్ తో ఉంటుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్ క్లచ్‌తో మరియు టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది.


సస్పెన్షన్ డ్యూటీ ముందు భాగంలో డబ్ల్యుపి-సోర్స్డ్ 43mm యుఎస్డి ఫోర్కులు 170 mm ట్రావెల్ మరియు వెనుకవైపు 177mm మోనోషాక్ యూనిట్,  ట్రాక్షన్ కంట్రోల్‌తో పాటు  ఎబిఎస్‌తో నుండి  బొస్క్  బ్రేకింగ్ స్విచ్ చేసుకోవచ్చు.  320 మి.మీ ఫ్రంట్, 230 మి.మీ వెనుక డిస్క్‌ల  బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 14.5 లీటర్లు, 390 డ్యూక్ కంటే లీటరు ఎక్కువ. 390 అడ్వెంచర్ 158 కిలోల బరువు ఉంటుంది. ఇది 390 డ్యూక్ కంటే తొమ్మిది కిలోలు ఎక్కువ.


KTM 390 అడ్వెంచర్ భారతదేశంలో చకన్ లోని బజాజ్-కెటిఎమ్ వద్ద తయారు చేయబడుతుంది అక్కడి నుండి ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ బైక్ భారత్‌లోకి ప్రవేశించి 2020 ప్రారంభంలో మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 390 అడ్వెంచర్‌ ధర ₹ 3-3.2 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా అంచనా వేయవచ్చు. BMW G 310 GS, కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300, బెనెల్లి టిఆర్కె 502  బైక్ లకు ఇది మంచి పోటీగా నిలుస్తుంది.

PREV
click me!

Recommended Stories

MG Comet : అసలే చవకైన ఈవీ కారు.. ఇప్పుడు ఇయర్ ఎండ్ ఆఫర్లో మరో రూ.1 లక్ష డిస్కౌంట్
Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్