హ్యుండాయ్ 2020 వెర్నాతో ఆ ఐదు సంస్థలకు సవాలే

By narsimha lode  |  First Published Mar 31, 2020, 11:55 AM IST

దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యూండాయ్‌ మోటార్స్‌ భారత మార్కెట్లోకి వెర్నా సరికొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది.


న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యూండాయ్‌ మోటార్స్‌ భారత మార్కెట్లోకి వెర్నా సరికొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈ కారు ప్రారంభ ధర రూ.9.30లక్షలుగా నిర్ణయించింది. ప్రీమియం వేరియంట్‌ ధర ధర రూ.13.99లక్షలుగా నిర్ణయించింది. 

ఈ కారు ఎస్‌,ఎస్‌+,ఎస్‌ఎక్స్‌,ఎస్‌ఎక్స్‌(ఓ),ఎస్‌ఎక్స్‌(ఓ) టర్బో అనే ఐదు మోడళ్లలో లభించనున్నది. ఈ నెల ప్రారంభంలో కారు ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించింది.

Latest Videos

 దీని కింద రూ.25వేలు టోకెన్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నందున పరిస్థితులు చక్కబడిన తర్వాత హ్యుండాయ్ వెర్నా పేస్ లిఫ్ట్ మోడల్ కారు డెలివరీ తేదీలను వెల్లడించనున్నది.

హ్యుండాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ మోడల్ సరికొత్త వెర్షన్‌లో క్రోమ్‌గ్రిల్‌ను అమర్చారు. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ఎస్‌, సరికొత్త బంపర్‌, డైమండ్‌ కట్‌ అల్లాయ్‌వీల్స్‌, ఓఆర్‌వీఎం, సిల్వర్‌ డోర్, హ్యాండిల్స్‌లో మార్పులు చేశారు. 

హ్యుండాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ మోడల్ కారు ఆరు రంగుల్లో సరికొత్తగా లభిస్తుంది. ఫైరీ రెడ్‌, టైటాన్‌గ్రే, స్టెర్రీ నైట్‌, టైఫూన్‌ సిల్వర్‌, పోలార్‌ వైట్‌, ఫాంటమ్‌ బ్లాక్‌ వంటి రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉన్నది. కారు ఇంటీరియర్‌ను డ్యూయల్‌టోన్‌ కలర్స్‌లో తేనున్నారు. దీంతోపాటు చాలా ఫీచర్లను అందించారు.

హ్యుండాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ మోడల్ కారును ఎరుపు రంగు అంచుతో నలుపు ఇంటీరియర్‌ను అందంగా తీర్చిదిద్దారు. దీనిలో స్పోర్ట్స్‌ డిజిటల్‌ క్లస్టర్‌ కలర్‌ టీఎఫ్‌టీ, మల్టీ ఫంక్షన్‌ స్టీరింగ్‌ వీల్‌, ఫ్రంట్‌ వెంటిలేటెడ్‌ సీట్స్‌, ట్విన్‌ టై మఫ్లర్‌ డిజైన్‌, స్మార్ట్‌ ట్రంక్‌, ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, ఎకో కోటింగ్‌, ఎలక్ట్రానిక్‌ సన్‌రూఫ్‌, ఆర్కమైస్‌ ప్రీమియం సౌండ్‌ వంటివి ఉన్నాయి.
 
హ్యుండాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ మోడల్ కారు మొత్తం మూడు రకాల ఇంజిన్లతో అందుబాటులోకి వచ్చింది. 1.5లీటర్‌ ఎంపీఐ, 1.0లీటర్‌ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్‌, 1.2 లీటర్‌ యూ2 సీఆర్‌డీఐ డీజిల్‌ ఇంజిన్లలో లభించనుంది.

also read:ఆటో రంగానికి రోజుకు రూ.2300 కోట్ల లాస్.. బీఎస్-6 అమలు మరో ప్రాబ్లం

హ్యుండాయ్ రెండు పెట్రోల్‌ ఇంజిన్లు 113 బీహెచ్‌పీ శక్తిని, 144ఎన్‌ఎం టార్క్‌, 118 బీహెచ్‌పీ శక్తి, 172 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తాయి. ఇక  డీజిల్‌ ఇంజిన్‌ 250ఎన్‌ఎం టార్క్‌కు 113బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనిలో 6స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను స్టాండర్డ్‌కు ఆప్షనల్‌గా ఐవీటీని ఇచ్చారు. టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌కు 7స్పీడ్‌ డీసీటీ గేర్‌బాక్స్‌ను అమర్చారు. 

2020 హ్యుండాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ కారు తన ప్రత్యర్థి సంస్థలైన మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, వోక్స్ వ్యాగన్ వెంటో, టయోటా యారిస్, స్కోడా వారి రాపిడ్ కార్లతో తలపడనున్నది. వివిధ మోడల్ కార్లలో హ్యుండాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ ధరలు ఒకసారి పరిశీలిద్దాం..

* 2020 వెర్నా 1.5లీటర్ల సామర్థ్యం గల వేరియంట్ 6-ఎంటీఎస్ కారు ధర రూ. 9.30 లక్షలు.

* 2020 వెర్నా 1.5లీటర్ల పెట్రోల్ వేరియంట్6-ఎంటీ ఎస్ఎక్స్ - రూ. 10.70 లక్షలు.

* 2020 వెర్నా 1.5లీటర్ల పెట్రోల్ వేరియంట్ ఐవీటీ ఎస్ఎక్స్ - రూ.11.95 లక్షలు

* 2020 వెర్నా 1.5లీటర్ల పెట్రోల్ వేరియంట్ 6-ఎంటీ ఎస్ఎక్స్(ఓ) - రూ. 12.59 లక్షలు

* 2020 వెర్నా 1.5లీటర్ల పెట్రోల్ ఐవీటీ ఎస్ఎక్స్ (ఓ) - రూ. 13.84 లక్షలు.

* 2020 వెర్నా 1.0లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ వేరియంట్ 7-డీసీటీ ఎస్ఎక్స్ (ఓ) - రూ. 13.99 లక్షలు

* 2020 వెర్నా 1.5 లీటర్ల డీజిల్ వేరియంట్ 6-ఎంటీ ఎస్ ప్లస్ రూ.10.65 లక్షలు

* 2020 వెర్నా 1.5 లీటర్ల డీజిల్ వేరియంట్ 6-ఎంటీ ఎస్ఎక్స్ రూ.12.05 లక్షలు

* 2020 వెర్నా 1.5 లీటర్ల డీజిల్ వేరియంట్ 6-ఎటీ ఎస్ఎక్స్ రూ.13.20 లక్షలు

* 2020 వెర్నా 1.5 లీటర్ల డీజిల్ వేరియంట్ 6-ఎటీ ఎస్ఎక్స్ (ఓ)- రూ.13.94 లక్షలు

* 2020 వెర్నా 1.5 లీటర్ల డీజిల్ వేరియంట్ 6-ఎటీ ఎస్ఎక్స్ (ఓ) రూ.15.09 లక్షలు

click me!