Couple Photos: భార్యభర్తల ఫొటో స్టేటస్ పెడితే గొడవలు అవుతాయా? జ్యోతిష శాస్త్రం ఏం చెబుతోంది?

Published : Apr 24, 2026, 07:56 PM IST
Will putting a husband and wifes photo as a status cause fights What does astrology say

సారాంశం

Couple Photos: సోషల్ మీడియాలో జంటలు తమ ఫొటోలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇది అభద్రతాభావానికి సంకేతమని సైకాలజిస్టులు అంటున్నారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి పబ్లిక్ షో వల్ల శుక్రుడి శక్తి తగ్గి, బంధంలో గొడవలు రావొచ్చని చెబుతోంది. 

ఇది సోషల్ మీడియా కాలం. జీవితంలోని జరిగే  ప్రతీ క్షణాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు ఎంతో మంది, కొంతమంది తమ సంతోషం కోసం, మరికొందరు ఇతరులు చూడాలనే ఉద్దేశంతో ఫొటోలు వాట్సాప్ స్టేటస్ పెడుతుంటారు. కారణం ఏదైనా సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా కొందరు జంటలు అయితే మరీ అతిగా ప్రవర్తిస్తుంటారు. పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి సందర్భాల్లో తమ పార్ట్‌నర్‌ను ఆకాశానికెత్తుతూ పోస్టులు పెడతారు. ఇంట్లో పిలుచుకునే  'చిన్నా', 'బంగారం' లాంటి ముద్దు పేర్లను, ఇద్దరి మధ్య జరిగే సంభాషణలను కూడా సోషల్ మీడియాలో రాసేస్తుంటారు.

ఇతరుల కోసం బతకడం

ఇలా సోషల్ మీడియాలో తమ పార్ట్‌నర్‌ను పదేపదే పొగడటం వెనుక ఉన్న కారణాలను సైకాలజిస్టులు ఇప్పటికే విశ్లేషించారు. భార్య లేదా భర్తలో అభద్రతాభావం ఉన్నప్పుడే ఇలా పబ్లిక్‌గా పొగుడుతూ స్టేటస్‌లు పెడతారట. పైకి అలా కనిపించినా, నిజానికి వాళ్ల ఇంట్లో పరిస్థితి వేరేలా ఉంటుంది. కానీ తాము చాలా సంతోషంగా ఉన్నామని ఇతరులు అనుకోవాలని (కొన్నిసార్లు కొందరిని టార్గెట్ చేసి, వాళ్లు కుళ్లుకోవాలని) ఇలా చేస్తుంటారు. నిజంగా ప్రేమగా, అన్యోన్యంగా ఉండే జంటలు తమ బంధం గురించి పదేపదే సోషల్ మీడియాలో ప్రదర్శించుకోవాల్సిన అవసరం రాదని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో పెట్టడానికి కారణం ఏదైనా కావచ్చు. ఆ విషయం పక్కన పెడితే, మీ జంట ఫొటోను సోషల్ మీడియాలో పెట్టిన ప్రతీసారి మీ జీవితంలో ఏదో నెగటివ్‌గా జరుగుతున్నట్టు మీకు అనిపిస్తోందా? జరగకూడనిది ఏదో జరుగుతోందని మీకు అనిపిస్తే, కచ్చితంగా ఆ ఫొటో మీపై ప్రభావం చూపుతోందని అర్థం. ఈ విషయాన్ని ప్రముఖ న్యూమరాలజిస్ట్ అరవింద్ రతన్ చెబుతున్నారు.

జ్యోతిష శాస్త్రం చెప్పేది ఇదే

ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 'arvindrathannumerologist'లో ఈ విషయం గురించి రాశారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి గల కారణాలను వివరించారు. మీరు చాలా అన్యోన్యంగా ఉన్న ఫొటోలను అప్‌లోడ్ చేసినప్పుడు, శుక్రుడి శక్తి బలహీనపడుతుంది. శుక్రుడు అంటే మనస్సు. అది ప్రైవసీకి సంబంధించిన గ్రహం. మీ ప్రేమ మీ మధ్యే ఉండాలి. దాన్ని ప్రపంచానికి చూపించాలని ప్రయత్నించినప్పుడు రాహువు ప్రభావం మొదలవుతుంది. మేమిద్దరం చాలా బాగున్నామని, అన్యోన్యంగా ఉన్నామని చూపించడానికి రకరకాలుగా ఫొటోలు దిగే క్రమంలోనే బంధంలో బలహీనతలు మొదలవుతాయని ఆయన అంటున్నారు. అయితే ఇది అందరికీ జరగాలని లేదు. ఒకవేళ మీకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే, పదేపదే మీ జంట ఫొటోలను అప్‌లోడ్ చేయడం ఆపేయమని ఆయన సలహా ఇస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Planets Conjunction: ఒకే రాశిలో మూడు గ్రహాల కూటమి.. ఈ రాశుల లైఫ్ డేంజర్ లో పడినట్లే..
Career Horoscope: ఈ రాశుల వారు 2 నెలల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు, వీరి గోల్డెన్ టైమ్ మొదలు