శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం మిథున రాశివారికి ఈ ఏడాది గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. స్థిరాస్తి అభివృద్ధి చేయుటకు ఈ సమయం అనుకూలం.
కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.
ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.
undefined
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 గత.
ఆదాయం:-2
వ్యయం:-11
రాజపూజ్యం:-2
అవమానం:-4
గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి దశమ స్థానము అయిన మీన రాశి యందు సంచారం చేసి ఏప్రిల్ 21 తేదీ నుండి ఏకాదశ ఏకాదశి స్థానమునందు సంచారం చేయను.
శని:- ఈ సంవత్సరం మొత్తం నవమ స్తానమైన భాగ్య స్థానము నందు సంచారం చేయను.
రాహు:-సంవత్సర ప్రారంభం నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు ఏకాదశి స్థానం అయిన మేష రాశి యందు సంచారం చేసి తదుపరి దశమ స్థానమైన మీనరాశి యందు సంచారం చేయను.
కేతువు:-సంవత్సర ప్రారంభం నుండి పంచమ స్థానమైన తులా రాశి యందు సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ నుండి చతుర్ద స్థానమైన కన్య యందు సంచారం చేయను.
ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే...
ఈ సంవత్సరం గురు బలం చేత తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గి సుఖం ప్రశాంతత ఏర్పడుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు. అభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్నిస్తుంది. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగం చేయు వారికి అధికార ప్రాప్తి కలుగుతుంది. సంతానం కోసం ఎదురుచూసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.నూతన వస్తూ వాహనాది కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు ఎక్కువ అవుతారు. తండ్రి యొక్క ఆస్తి విషయాలలో స్తబ్దత ఏర్పడుతుంది. కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. సంతాన ప్రాప్తి. అష్టమ శని తొలగి అన్నవిధాల అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహంగా ఉంటాయి. నూతన వస్తూ వాహనాది కొనుగోలు చేస్తారు. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. స్థిరాస్తి అభివృద్ధి చేయుటకు ఈ సమయం అనుకూలం. ఆర్థికంగా బలపడతారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేయు వారికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయంగా ఉండే వారికి ఈసంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రజాభిమానం పొందగలరు. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యవసాయదారులకు పంటల పండి ఆదాయం బాగుంటుంది .
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సర మేష రాశి తెలుగు పంచాంగ రాశి ఫలాలు
ఏప్రిల్
వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కీలకమైన సమస్యలను ధైర్యంగా ముందుకు వెళ్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ వ్యవహారము నందు కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త అవసరం. పై అధికారుల తోటి విభేదాలు ఏర్పడవచ్చు.
మే
అను విధాల అనుకూలంగా ఉండును. ఆర్థికంగా బలపడతారు. వృత్తి వ్యాపారాలు యందు ధన లాభం కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించును. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహ ది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు.
జూన్
శుభవార్తలు వింటారు.సమాజం నందు ప్రతిభగు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయత్నించిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ మాసం విలాసవంతంగా గడుపుతారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.
జూలై
బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. సంతాన అభివృద్ధి ఆనందం కలగజేస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి . ఆర్థికంగా అన్న విధాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారం నందు లాభాలు పొందగలరు. సమాజం నందు మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఆగస్టు
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబం సభ్యుల మధ్య మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించవలెను. బంధుమిత్రుల తోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. రుణాలు ఇచ్చేందుకు ముందు జాగ్రత్త అవసరం. సంతోషకరమైన వార్తలు వింటారు. సమాజం నందు పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు కలిసి వచ్చును.
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సర: వృషభ రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు
సెప్టెంబర్
ఉద్యోగం ఉంది అభివృద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారం నందు పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులకు ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. విద్యార్థులు ఉన్నతి విద్యా అవకాశాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును.
అక్టోబర్
మానసికంగా శారీరకంగా బలపడతారు. సంఘమనంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబం నందు మీ ప్రతిభ గుర్తిస్తారు . ప్రయత్నించిన పనులన్నీ సకాలంలో పూర్తగును. మధ్యవర్తిత్వ ములకు దూరంగా ఉండవలెను. పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
నవంబర్
గౌరవ ప్రయాణాలు వలన లాభం కలుగును. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల తోటి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
డిసెంబర్
వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువర్గంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. సంతాన అభివృద్ధి ఆనందం కలుగుతుంది. సమాజము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. చిన్నపాటి అనారోగ్యాలు ఎదురవగలవు. చేయ వ్యవహారమునందు కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించవలెను. సంఘమనందు కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. జీవిత భాగస్వామి తోటి మాట పట్టింపులు రాగలవు.
జనవరి
ఇంటా బయట ప్రతికూలత వాతావరణ ఏర్పడును. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు. ఎంతోకొంత రుణం చేయవలసి వస్తుంది. ఉద్యోగం నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడగలవు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. వ్యాపారం నందు పెట్టుబడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది. నిరాశ నిస్పృహలకు లోనవుతారు.
ఫిబ్రవరి
చేయు వ్యవహారవనందు మనస్థిమితం ఉండదు. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు పెరుగును. స్థానచనాలు గృహ మార్పులు ఏర్పడగలవు. ప్రతి చిన్న విషయం నందు తొందరపాటు పడతారు. భూ సంబంధ విషయాలలో ధన నష్టం ఏర్పడుతుంది. తలపెట్టిన పనులను పనులలో ఆటంకాలు. సమాజము నందు అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మార్చి
వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. క్లిష్టమైన సమస్యలను చాకచక్యంగా ఎదుర్కొంటారు. గృహవనందు శుభకార్యములు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని విధాల అభివృద్ధి కనిపించను.