శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం వృశ్చిక రాశివారికి ఈ ఏడాది ఏప్రిల్ దాటిన తర్వాత శారీరక శ్రమ అధికమవుతుంది . అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి . ఈ రాశి అర్ధాష్టమ శని . చేయు పనుల యందు ఆటంకాలు ఏర్పడతాయి .
కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.
ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.
undefined
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
ఆదాయం:-5
వ్యయం:-5
రాజపూజ్యం:-3
అవమానం:-3
గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి పంచమ స్థానం నందు సంచారం చేసి ఏప్రిల్ 21 నుండి షష్టమ స్థానము నందు సంచారం చేయను.
శని:-సంవత్సరం ప్రారంభం నుండి చతుర్ద స్థానము నందు సంచారం అర్ధాష్టమ శని
రాహు:-సంవత్సర ప్రారంభం నుండి షష్టమ స్థానమందు సంచారం చేసి అక్టోబర్ 31 నుండి పంచమ స్థానము నందు సంచారం చేయను.
కేతువు: సంవత్సర ప్రారంభం నుండి వ్యయస్థానం స్థానం సంచారం చేసి అక్టోబర్ 31 ఏకాదశి లాభ స్థానం నందు సంచారం చేయను.
ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధిస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం అవుతాయి.శుభ కార్యక్రమాలు ఆలోచనలు ఫలిస్తాయి. మీ యొక్క బంధువర్గంలో ఆదర అభిమానులు పెరుగుతాయి.స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగమనందు అనుకూలమైన మార్పులు. అధికార ప్రాప్తి కలుగుతుంది . అనుకోని సన్మానాలు సత్కారాలు అందుకుంటారు . ఏప్రిల్ దాటిన తర్వాత శారీరక శ్రమ అధికమవుతుంది . అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి . ఈ రాశి అర్ధాష్టమ శని . చేయు పనుల యందు ఆటంకాలు ఏర్పడతాయి . ఇతరులతోటి వాగ్వివవాదనలకు దూరంగా ఉండటం మంచిది . దురాఆలోచనలు కలుగుతాయి . ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయి . కుటుంబ సభ్యుల తోటి మనస్పర్ధలు రావచ్చును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం . బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడతాయి . భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. వ్యాపారంలో పెట్టుబడి మిత్రుడి యొక్క నూచినలు మేరకు పెట్టుబడులు పెట్టవలెను. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి . కీలకమైన సమస్యలు పరిష్కారాలు లభిస్తాయి. సంగమనందు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. శత్రువులే మిత్రులు అయి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు పరీక్షలు ఉత్తీర్ణత సాధిస్తారు.
ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే...
ఏప్రిల్
నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమాజము నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రతి విషయంలో ఆచి తూచి అడుగులు వేయడం ఉత్తమం. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు.
మే
ఆర్థికంగా బలంగా ఉన్న ఎంతోకొంత రుణాలు చేయాల్సి వస్తుంది. తలపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. శారీరకంగా బలహీనంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
జూన్
జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు విరోధాలు రావచ్చు. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసర ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి. సమాజం నందు అపకీర్తి ఏర్పడగలదు. కొద్దిపాటి ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి. శారీరక శ్రమ పెరిగి తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
జూలై
ఈమాసం మిశ్రమంగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. సంతాన మూలక లాభాలు చేకూరుతాయి. ఉద్యోగమునందు అధికార అభివృద్ధి కలుగును. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం పొందగలరు.
ఆగస్టు
ప్రయత్నించిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తగును. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలించును. సమాజము నందు చేయ వ్యవహారములు ఆలోచించి వ్యవహరించవలెను. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. వైవాహక జీవితం ఆనందంగా గడుపుతారు.
సెప్టెంబర్
వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును. ప్రయత్నించిన అన్ని కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఇష్టమైన వస్తువులు యందు కొనుగోలు నిమిత్తం అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.
అక్టోబర్
ఆరోగ్యం బాగుంటుంది . సంఘమనందుకీర్తి ప్రతిష్టలు పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంతాన వృద్ధి ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శారీరకంగా కొంత శ్రమ పెరుగుతుంది.
నవంబర్
ఈమాసం కొద్దిపాటి కష్టాలు ఎదురవచ్చు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మిత్రుల తోటి విరోధాలు రావచ్చు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలు పెరుగును. కుటుంబ సభ్యులతో ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించవలెను.
డిసెంబర్
గృహమునందు ఆనందకరమైన వాతావరణం.ఆరోగ్యమనందు కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. చేయ పనులు అనుకూలంగా చేయగలతారు. వ్యవహారం నందు కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించవలెను. ఉద్యోగమునందు సహోద్యోగులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.
జనవరి
సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. చేయు వ్యవహారం నందు విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సమాజంలో అరుదైన గౌరవం లభిస్తుంది. వృత్తి వ్యాపారములు అభివృద్ధి కరంగా సాగుతాయి. ఆర్థికంగా బలపడతారు.
ఫిబ్రవరి
ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ పరమైన అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. విద్యార్థులు ప్రతిభ పాటలు చూపిస్తారు. ఆదాయ మార్గ అన్వేషణలు ఫలిస్తాయి. స్థిరాస్తి అభివృద్ధి కలుగుతుంది. ఈ మాసం అన్ని విధాల బాగున్నది.
మార్చి
వివాహ ది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అధికారంతో కూడిన అనుకూలమైన బదలీలు ఏర్పడగలవు. ప్రతి చిన్న సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.