శ్రీ శోభకృత్ నామ సంవత్సర: కర్కాటక రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు

By telugu news team  |  First Published Mar 15, 2023, 2:54 PM IST

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం కర్కాటక రాశివారికి ఈ ఏడాది  ఆర్థిక లాభాలు ఉన్నప్పటికిని మానసిక ఇబ్బందులు పడతారు. స్థిరాస్తి విషయాలలో ముందుచూపుతోటి ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకొనవలెను. తరచూ ప్రయాణాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు కలహాలు ఏర్పడతాయి ‌.


కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Latest Videos

undefined

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
 కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆదాయం:-11
వ్యయం:-8
రాజపూజ్యం:-5
అవమానం:-4

గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి భాగ్యస్థానమున సంచారం చేసి ఏప్రిల్ 21 తేదీ నుండి దశమ స్థానం నందు సంచారం చేయను.

శని:-ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానము నందు సంచారం చేయను అష్టమ శని.

రాహు:- సంవత్సర ప్రారంభం నుండి దశమ స్థానము నందు సంచారం అక్టోబర్ 31 నుండి భాగ్యస్థానం నందు సంచారం చేయను.

కేతువు:-సంవత్సర ప్రారంభం నుండి చతుర్ధ స్థానము నందు సంచారం చేసి అక్టోబర్ 31 నుండి తృతీయ స్థానం నందు సంచారం చేయను.

ఈ రాశి వారికి అష్టమశని ప్రారంభమయినది   ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు . అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి . అనారోగ్య సమస్యలు వస్తాయి. . చేయు వృత్తి వ్యవహారాలు యందు ఆసక్తి తగ్గుతుంది. తలపెట్టిన పనులు పూర్తి కాక మధ్యలో ఆగిపోతాయి. కుటుంబ సభ్యులకు తోటి అనవసరమైన గొడవలు మనస్పర్ధలు ఏర్పడతాయి . మిత్రుడు దూరం చేసుకోవద్దు .చేయు పని వారితోటి సఖ్యతగా ఉండవలెను. అయితే గురు బలం చేత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్న అవసరమైన సమయానికి ధనం చేకూరుతుంది . కొద్దిపాటి రుణాలు తీరి ఉపశమనం దొరుకుతుంది అనవసరమైన ప్రయాణాలు వలన చికాకులగా ఉంటుంది. చేయ ఉద్యోగమనందు సహోదయోగల వలన గొడవలు ఏర్పడతాయి .  బుద్ధి స్థిరత్వం లేక అనేక సమస్యలు వస్తాయి. వివాహాదిప్రయత్నాల లో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోగలరు. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికిని మానసిక ఇబ్బందులు పడతారు. స్థిరాస్తి విషయాలలో ముందుచూపుతోటి ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకొనవలెను. తరచూ ప్రయాణాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు కలహాలు ఏర్పడతాయి ‌. ఇతరులతోటి వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది. సమాజం నందు అపవాదములు ఎదుర్కోవాల్సి వస్తుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును. కేతువు సంచారం వలన శుభ ఫలితాల సమకూరుతాయి. శారీరకంగా మానసంగా బలము ఏర్పడుతుంది. ప్రజల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. వృత్తి వ్యాపారం నందు ధన లాభం చేకూరుతుంది. సౌభాగ్యం తలచిన పనులు సకాలంలో పూర్తగును.

 

Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సర: మిధున రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు


ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే... 


ఏప్రిల్
వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉండను. చేయ పని యందు శారీరక శ్రమ పెరిగి బలహీనత పొందుతారు. సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తలపెట్టిన పనులు పూర్తి కాక ఇబ్బందులు పడతారు. పిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించవలెను. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరం.

మే
ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. కులదేవతారాధన దైవ సంబందిత పూజా కార్యక్రమాల్లో ఉద్యోగం నందు మీ యొక్క బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు. బందువర్గం తోటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆరోగ్యం చేకూరి  ప్రశాంతత లభిస్తుంది. పెద్దవారి యొక్క ఆదరణ అభిమానాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది.

జూన్
ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతోటి విరోధాలకు కలహాలకు దూరంగా ఉండడం మంచిది. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి తోటి మరియు బంధు వర్గం తోటి విరోధాలు రావచ్చు. తలపెట్టిన పనులలో ప్రతిభందకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయ. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.శుక్రుడు జన్మ రాశి సంచార వలన పనులలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

జూలై
ప్రయత్న కార్యాలు సఫలీకృతం అవుతాయి. వృత్తి వ్యాపారం నందు లాభసాటిగా రాణిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమనందు అధికార అభివృద్ధి కలుగుతుంది. కొద్దిపాటి కలహాలు రావచ్చు. రవి బుదుల సంచారం అంత అనుకూలంగా లేదు.

ఆగస్టు
ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో రాణిస్తారు. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. చేయు వ్యవహారం నందు కోపం పెరిగి ఇబ్బందులకు గురవుతారు. సమాజం నందు అపవాదములు కలగొచ్చు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కలిగి అన్యోన్యంగా గడుపుతారు.

సెప్టెంబర్

సంసార సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమనందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు‌. విద్యార్థులు చదువు యందు ప్రతిభ పాటలు చూపిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ప్రభుత్వ అధికారులు వలన లాభపడతారు. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అప్రయత్నంగా ధన లాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు.

అక్టోబర్
కుటుంబ అభివృద్ధి ఆనందం కలుగజేస్తుంది. సన్మానాలు బహుమానాలు పొందుతారు. నూతన వస్తు వాహన వస్త్రాది కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించును. ఎంతటి కష్టమైన పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగును. వివాహది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.

నవంబర్
కుటుంబవనందు చిన్నపాటి చికాకులు ఏర్పడతాయి. అనవసరమైన ప్రయాణాలు ఇబ్బందికరంగా మారుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు ‌. బంధవర్గంతోటి కొద్దిపాటి విరోధాలు రావచ్చు‌. దూరాలోచనలకు దూరంగా ఉండటం మంచిది. నమ్మిన వారిని వలన మోసం జరగవచ్చు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

డిసెంబర్
బుధ గ్రహ సంచారం వలన ధన ధాన్య అభివృద్ధి కలుగుతుంది. చేయ పనులలో బుద్ధి కుశలత ఏర్పడి కార్య సాధన సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.

జనవరి
వచ్చిన అవకాశాలని చేజారుస్తారు. చిన్నపాటి అనారోగ్యాలు తలెత్తుతాయి. ఉద్యోగ సంబంధ విషయాలలో ప్రతికూలత వాతావరణం. సంతానం తోటి విరోధాలు. అకారణ కోపాలు ఏర్పడను. విలాసవంతులైన వస్తువులు వినోదాలకు ఖర్చు ఎక్కువ చేస్తారు. సమాజము నందు ప్రజాభిమానం పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.


ఫిబ్రవరి
అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఋణం చేయవలసి వస్తుంది. శత్రువుల బాధలు  పెరుగుతాయి. చేయు వ్యవహారమునందు ఆటంకాలు ఏర్పడవచ్చు. సమాజము నందు అవమానం కలగవచ్చు. ఉద్యోగులకు ఆకస్మిక  స్థాన చలనం ఏర్పడుతుంది. కుటుంబం నందు విరోధాలు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడవచ్చు.


మార్చి
జీవిత భాగస్వామి  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించవలెను. ఇతరులతోటి వివాదములకు దూరంగా ఉండవలెను. చేయు వ్యవహారమునందు కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించవలెను. మనసునందు అశాంతి ఏర్పడుతుంది. బంధువర్గము ద్వారా అనేక అవరోధాలు ఏర్పడవచ్చు. ఉదర సంబంధిత వ్యాధులు తోటి ఇబ్బందు కలుగును. జీవిత భాగస్వామి తోటి అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి.

click me!