శ్రీ శోభకృత్ నామ సంవత్సర మేష రాశి తెలుగు పంచాంగ రాశి ఫలాలు

By telugu news team  |  First Published Mar 13, 2023, 1:44 PM IST

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం మేష రాశివారికి ఈ ఏడాది  కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును. ఉద్యోగమునందు అధికారాల   ఒత్తిడి అధిక శ్రమ ఏర్పడతాయి.


కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన పరిష్ల్కారాలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Latest Videos

undefined

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):


ఆదాయం:-5
వ్యయం:-5
రాజపూజ్యం:-3
అవమానం:-1

గురుడు సంవత్సరాది నుండి ఏప్రిల్ 21 వరకు మీన రాశి సంచారం తదుపరి  మేషరాశిలో సంచరించును.శని సంవత్సరం అంతా కుంభరాశిలో సంచారం చేయను. రాహు సంవత్సరాది నుండి అక్టోబర్ 30 వరకు మేషరాశిలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం చేయను.

కేతువు సంవత్సరాది నుండి తులా రాశిలో సంచారం చేసి అక్టోబర్ 30 తారీకున కన్యారాశి ప్రవేశించును. గత సంవత్సరము కన్నా ఈ సంవత్సరం అన్ని విధాల యోగించును.   శని ఏకాదశ స్థానం సంచారం వలన అన్ని విధాలా బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు నశించి ఆయురారోగ్యాలను పొందగలరు.

ఈ సంవత్సరం ఉద్యోగం నందు బాధ్యతలు పెరుగును. సమాజం నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది.  చేయు వృత్తి వ్యాపారాలకు సంబందించిన నైపుణ్యాలు, అభివృద్ధి కనబరుస్తారు.  స్థానచలనం కలుగుతుంది. అనుకోని సన్మానాలు సత్కారాలు అందుకుంటారు. వ్యసనాలకు దూరంగా ఉండవలెను. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ  తీసుకోవాలి.  కొత్త వ్యాపారం చేయవారికి ఈ సంవత్సరం అనుకూలం. మానసికంగా శారీరకంగా  ఉత్తేజంగా ఉంటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా స్థిరపడతారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబము నందు ఆనంద ఆహ్లాదకరంగా ఉంటుంది. భూ గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. సంతాన వృద్ధి ఆనందం కలిగిస్తుంది. శుభకార్యాల వలన ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. స్థిరాస్తి విషయంలో ఆటంకాలు ఆస్తి నష్టం ఏర్పడవచ్చు. బంధువులతోటి అకారణంగా విరోధాలు. ఇలాంటి సమస్యలు ఏదైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం ఈ రాశి వారు ఏప్రిల్ దాటిన తర్వాత గురు గ్రహ జప హోమ దానాలు, ఏకాదశ రుద్రాభిషేకం  రాహు గ్రహానికి శాంతి చేయించవలెను.


ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే... 


ఏప్రిల్
వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు పెరిగి కొంతమేర రుణాలు చేయవలసి వచ్చును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును. ఉద్యోగమునందు అధికారాల ఒత్తిడి, అధిక శ్రమ ఏర్పడతాయి.కొన్ని సమస్యలు ఊహించిన దానికంటే ఎక్కువగా బాధించును.

మే
ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మానసికంగా అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉండును. ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగం నందు పైఅధికారులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.

జూన్
ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వచ్చును. మీ ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. దూరపు ప్రయాణాలు లభిస్తాయి. గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆరోగ్యం కుదుటపడి ప్రశాంతత లభిస్తుంది. గృహంనందు శుభ కార్యక్రమాలు జరుగును. తలపెట్టిన పనులు తగిన సమయానికి పూర్తి చేస్తారు.

జూలై
ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు సాధిస్తారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. సమాజం నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. ధర్మకార్యాలు ఆచరిస్తారు.

ఆగస్టు
మనసునందు ఆందోళనగా ఉండుట. బంధువులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యల ఏర్పడగలవు. బుద్ధి కుశలత తగ్గి తల పెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. శారీరక శ్రమ పెరుగును. ఆరోగ్య విషయంలో తగ జాగ్రత్తలు తీసుకోవాలి.

సెప్టెంబర్
విలాసవంతమైన వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని సమస్యలు వలన ఇబ్బందులు కలిగినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని అనుకూలంగా మార్చుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. సంతానము నందు కొన్ని విషయాలలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.

అక్టోబర్
భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. సోదర సోదరి మధ్య ఆస్తి వివాదాలు తలెత్తవచ్చు. అకారణంగా కోపం ఆవేశానికి లోనవుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

నవంబర్
అనాలోచిత పనులు వలన ఇబ్బందులు గురవుతారు. దీర్ఘకాలిక అనారోగ్యాలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. నమ్మిన వారి వలన మోసపోవచ్చు. ఎక్కువగా శ్రమించడం వలన అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలను, ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆనందకరమైన రోజులు ఎదురవుతాయి.

డిసెంబర్
అనుకూలమైన నెల మాసం ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు దూరపు ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి నూతన పరిచయాల లాభం. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరిగి దాంపత్య జీవితం బాగుంటుంది. కొన్ని కీలకమైన సమస్యలన్నీ బుద్ధికుసుల తోటి చాక చక్యంగా చక్క పెట్టుకుంటారు విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు అధికారుల లాభం కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి పిత్రార్జనక స్థిరాస్తి మూలక లాభం కలుగును.

జనవరి
మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలించి లాభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. రైతులకు మంచి పంట లభిస్తుంది. వ్యాపారాలు మంచిలాభ సాటిగా జరుగును. ఆర్థికంగా బలపడతారు. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలిస్తాయి.

ఫిబ్రవరి
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. శుభ కార్యాచరణ వలన అధిక ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. వాహన ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  విద్యార్థులు పట్టుదలతో  రాసిన పరీక్షలు యందు ఉత్తీర్ణులవుతారు. కొన్ని సమస్యలు ప్రతిబంధకంగా మారును. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. గృహమునందు ఆనందకరమైనవాతావరణం.

మార్చి
ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. కోపాన్ని అదుపుచేసుకొని వ్యవహారాలు చెక్కపెట్టుకొనవలెను . పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.  కుటుంబ సభ్యులతో  అనుకూలమైన మద్దతు  ఏర్పడుతుంది . కొన్ని సమస్యలను  సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. వ్యాపారం నందు ఆశించిన ఫలితాలు అందుకోలేరు. ప్రతిపని యందు ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను.

click me!