07ఫిబ్రవరి2019గురువారం రాశిఫలాలు

Published : Feb 07, 2019, 07:40 AM IST
07ఫిబ్రవరి2019గురువారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తిచేయడంలో ఆలోచిస్తారు. శ్రమతో పనులు సాధిస్తారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ఏపనిచేసినా శ్రమ తప్పదు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అన్యుల సహాయసహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు కొంత శ్రమ పడినా ఫలితాలు సాధిస్తారు. సామాజిక అనుబంధాలు జాగ్రత్తగా పెంచుకోవాలి. తొందరపాటు పనికారాదు. శ్రీమాత్రే నమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాక్‌చాతుర్యం తగ్గుతుంది. మాటల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబ సంబంధాలు ఒత్తిడికి గురయ్యే అవకాశం. ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు ఉన్నాయి. పోటీల్లో గెలుపుకై అధిక శ్రమ చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ ఉంటుంది. అనుకున్న పనులు ఒత్తిడితో పూర్తి అవుతాయి. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. పట్టుదలతో కార్యసాధన చేయాలి. అనవసర పనులు తగ్గించుకోవాలి. సంతానం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత పెంచుకోవాలి.శ్రీరామజయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనుకున్న పనులు పూర్తికావు. విహార యాత్రలపై ఆలోచన పెరుగుతుంది. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. ఆహారం సమయానికి తీసుకోవాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం అవసరం. అన్ని రకాల ఆదాయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ తప్పకపోవచ్చు. పెద్దల సహాయ సహకారాలు తీసుకుటాంరు. ప్రయాణాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాల్లో జాగ్రత్తలు. తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తలు అవసరం. వాక్‌ చాతుర్యం తగ్గుతుంది. ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబ సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. అనుకున్న పనులు ఒత్తిడితో పూర్తి అవుతాయి. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సంతృప్తి తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. సమయం వృథా అవుతుంది.  పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. పరామర్శలు చేస్తారు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పనులలో ఆటంకాలు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. దానధర్మాలకు అధికంగా వెచ్చించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. నూతన పరిచయాల వల్ల లోపాలు ఏర్పడతాయి. పెట్టుబడులు అంత అనుకూలం కాదు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అన్ని విధాల లాభాలకోసం ప్రయత్నం జరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం ఉంటుంది. శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కొంత ఒత్తిడి కొంత అనుకూలత ఏర్పడుతుంది. అధికారులతో అప్రమత్తత అవసరం.పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. చిత్త చాంచల్యం తగ్గించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంతాన సమస్యల ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. సృజనాత్మకతను పెంచుకుని పనులు చేయాలి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. సంతృప్తి లోపం ఏర్పడుతుంది. దానధర్మాలు అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ 17 డిసెంబర్: మీనాకి సవతిని తెచ్చి... సత్యం, ప్రభావతిలను కలిపిన బాలు, అదిరిపోయే ఎపిసోడ్
AI Horoscope: ఓ రాశివారు వృథా ఖర్చులు తగ్గించుకోవాలి