16సెప్టెంబర్ 2019 సోమవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Sep 16, 2019, 7:05 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సృజనాత్మకతను కోల్పోతారు. సంతానం వల్ల సంతానంతో సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పరిపాలన సమర్ధతను కోల్పోతారు. చిత్తచాంచల్యం పెరుగుతుంది. జాగ్రత్తలు అవసరం. తొందరపాటు పనికిరాదు. విష్ణుసహస్ర నామాలు వినడం


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పోటీల్లో విజయం సాధిస్తారు. శత్రువులపై గెలుపు ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యలపై ఆసక్తి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు. మొదలు పెట్టిన పనిలో విజయం. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అందరి మన్ననలు పొందుతారు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సృజనాత్మకతను కోల్పోతారు. సంతానం వల్ల సంతానంతో సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పరిపాలన సమర్ధతను కోల్పోతారు. చిత్తచాంచల్యం పెరుగుతుంది. జాగ్రత్తలు అవసరం. తొందరపాటు పనికిరాదు. విష్ణుసహస్ర నామాలు వినడం

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. వాహనాలు అనుకూలిస్తాయి. తీసుకునే ఆహారం అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారిని ఆకర్షించుకుంటారు. పనులు పూర్తి చేయించుకుంటారు. గృహ సంబంధ లోపాలు నెరవేరుతాయి. అనుకున్న పనులు పూర్తిచేసుకుంటారు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వ్యాపారస్తుల సహకారంకోసం ప్రయత్నాలు సాగుతాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో అనుకున్నంత సంతృప్తి లభించదు. ఒత్తిడితో పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు ఒత్తిడి సమయం. అధిక శ్రమ తక్కువ ఫలితాలు ఉండే సూచనలు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వాక్‌చాతుర్యం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. తద్వారా కుటుంబంలో అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. తమ పనులు పూర్తిచేసుకుంటారు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చిత్త చాంచల్యం కూడా ఉంటుంది. మొదలు పెట్టినన పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి కావడంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. పనులు పూర్తి కావడం కోసం కొంత శ్రమపడవలసి వస్తుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  అనుకున్న పనులు పూర్తిచేస్తారు. లాభాలు సమకూరుస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టి ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. కళాకారులకు అనుకూల సమయం ఉంటుంది. ఆదర్శవంతమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. పటుకుబడులు పెరుగుతాయి. సామాజిక అభివృద్ధి ఏర్పడుతుంది. పరాశ్రయం ఉంటుంది. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఏ పనిచేసినా సంతృప్తిలోపం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశీవ్యవహారాల్లో లోపాలు ఉంటాయి. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకోని ఆదాయాలు వచ్చే అవకాశం. వాటివలన శత్రువులు పెరుగుతారు. జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరామర్శలు అవకాశం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. జాగ్రత్త అవసరం. విష్ణుసహస్ర నామాలు వినడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పెట్టుడులు లాభిస్తాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపార అనుకూలతలు పెరుగుతాయి. నిల్వ ధనాన్ని పెంచుకుంటారు. భాగస్వామ వ్యాపారాలు అనుకూలిస్తాయి. దానం అవసరం.

డా.ఎస్.ప్రతిభ

click me!