18జూన్ 2019 మంగళవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Jun 18, 2019, 6:53 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వాక్‌చాతుర్యం పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. కుటుంబ సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కళలపై ఆసక్తి పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు  అనుకూలిస్తాయి. వాగ్దానాలు నెరవేరుస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కొంత శారీరక అసంతృప్తి కలుగుతుంది. అలంకరణలపై దృష్టి పెడతారు. పనులను ఆచి, తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పట్టుదలతో కార్యసాధన చేయడం మంచిది. శరీర అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. విహార యాత్రలపై దృష్టి పెడతారు. లగ్జరీస్‌ కావాలనే ఆలోచన పెరుగుతుంది. విలాసవంతమైన జీవితంపై దృష్టి మళ్ళుతుంది. అనవసర ఖర్చులకు వెనకాడరు. దానధర్మాలు చేయడం మంచిది. అలంకరణ వస్తువులు దానం చేయాలి. శ్రీమాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం ఏర్పడుతుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. వారసత్వ సంపదను నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. స్త్రీల ద్వారా ఆదాయ మార్గాలు పెరగుతాయి. అనుకున్నపనులు పూర్తి చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : చేసే వృత్తులలో అనుకూలత ఏర్పడుతుంది. అధికారులతో కలిసి వస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం కోసం ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం కలిసి వస్తుంది. కోర్టు, వృత్తి, ఉద్యోగాదులలో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  విదేశీ వ్యవహారాలపైదృష్టి సారిస్తారు. ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధకులకు అనుకూల సమయం కాదు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని పనులు పూర్తి చేస్తారు. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారంలో సమయపాలన మంచిది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని శ్రమతో సతమతమవుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. అనుకోని ఖర్చులు వస్తాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టి పెడతారు.    పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు విస్తరిస్తాయి. భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. కళాకారులకు అనుకూలమైన సమయం. శ్రీ మాత్రేనమః జపం మంచిది. 

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. విస్తరించే ప్రయత్నం   సఫలీకృతం కాదు. ఋణ సంబంధమైన ఆలోచనల్లో ఒత్తిడి తీరుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంతాన సమస్యలు తలెత్తుతాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంది. ప్రశాంతమైన వాతావరణం కోసం ఎదురుచూపులు ఉంటాయి. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకత పెంచుకునే ప్రయత్నం. క్రియేటివిటీతో పనిచేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. సౌకర్యాలపై దృష్టి పెంచుకునే ప్రయత్నం. ఆహారం విషయంలో సమయపాలన మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గృహ విషయంలో అనుకూల వాతావరణంపై దృష్టి కేంద్రీకరించాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : స్త్రీ వర్గీయుల సహకారం లభిస్తుంది. మాతృవర్గం వారితో అనుకూల ఏర్పడుతుంది. కళాకారులకు అనుకూల సమయం. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. రచనలపై ఆసక్తి విస్తరిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అనుకూల సమయం. అంతా మంచే జరుగుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!