today astrology: 21 జులై 2020 మంగళవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Jul 21, 2020, 7:06 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి గృహ సంబంధమైన విషయాల పట్ల ఆలోచన దృష్టిని సారిస్తారు. సులభంగా చేయాల్సిన పనులకు కూడా ప్రయాస పడాల్సి వస్తుంది. దీర్ఘాలోచనలు చేస్తారు.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

undefined

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :-  ఈ రోజు వీలైనంతవరకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. గోశాలలో గరిక దానం చేయడం ఉత్తమం. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. గృహ సంబంధమైన విషయాల పట్ల ఆలోచన దృష్టిని సారిస్తారు. సులభంగా చేయాల్సిన పనులకు కూడా ప్రయాస పడాల్సి వస్తుంది. దీర్ఘాలోచనలు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు ఒక ముఖ్య విషయంలో పురోగతి బాగుంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. న్యాయంగా మీకు రావాల్సిన ధనాన్ని అందుకోగలుగుతారు. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అమలు చేస్తారు. పర్యవేక్షణ లోపం లేకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు కళా సాంస్కృతిక రంగాల పట్ల అభిరుచిని కలిగి ఉంటారు. చేపట్టే పనుల్లో చాలా నేర్పు అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. చర్చలు ఫలిస్తాయి. ప్రజా సంబంధాలు మరింతగా వృద్ధి చెందుతాయి. సామాజిక కార్యక్రమాలకు గాను చందాలు వసూలు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఘటనలు జరుగుతాయి. అవసరాలకు సరిపడా ధనాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంతంలో నివసిస్తున్న మీ వారి యోగ క్షేమాలను తెలుసుకుంటారు. లేని వారికి బట్టలు దానం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు మానసికంగా దృఢంగా ఉంటారు. అధికారుల అనుగ్రహం పొందడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. వాస్తవికత ప్రామాణికంగా అడుగులు ముందుకు వేస్తారు. ఆహార ఆరోగ్య నియమాల పట్ల దృష్టిని సారించడం మంచిది. లాభనష్టాలను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కృషి ఫలిస్తుంది. తోటివారి సహాయంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి గాను బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తారు. శుభకార్య చర్చలను సాగిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. దురలవాట్లకు స్వస్తి చెబుతారు. నిర్మాణాత్మక కార్యక్రమాల్లో చురుకుదనాన్ని తీసుకువస్తారు. లౌక్యంగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూల పరచుకుంటారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ముఖ్యమైన బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్య విషయాల్లో ఓర్పుగా వ్యవహరించండి. ఒక సంఘటన మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. నూతన బంధాల్లో వినూత్న వ్యూహాలను అమలు చేస్తారు. ఆత్మ విమర్శ చేసుకుంటారు. నిజాయితీగా వ్యవహరిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు  ప్రత్యర్థి వర్గం మీ కన్నా బలహీనంగా ఉండటం లాభిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. రహస్య సమాచారం వెలుగు చూస్తుంది. మీ అభిప్రాయాలతో రాజీ ధోరణి ఏర్పడుతుంది. కొనుగోళ్లు, అమ్మకాలు సాగిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు క్షణం తీరిక లేకుండా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి సాధించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. లక్ష్యాలు నెరవేరుతాయి. బంధువుల అండదండలు ఉంటాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు మీకు ఎంతమాత్రం సంబంధం లేని విషయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. మీ శక్తి సామార్థ్యాలు పెరుగుతాయి. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించండి. ప్రయాణాల్లో మెలకువ అవసరం. సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మానసికంగా దృఢంగా ఉంటారు. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. చిన్నపాటి వివాదాలను ఆదిలోనే పరిష్కరించుకుంటారు. వినోద కార్యక్రమాలను ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రుచికరమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

 

click me!