ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులకు సరిపడా ధనం ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. మిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు బంధువుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొనివుంటుంది. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. మీ ప్రమేయం లేకుండానే మాటపడవలసి వస్తుంది. జాగ్రత్త వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ రోజు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులకు సరిపడా ధనం ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. మిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు వృత్తిపరంగా ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. గృహ నిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. కోర్టు వ్యాజ్యాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. సోదరీ, సోదరులతో విభేదాలు తప్పవు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఆదర్శభావాలు గల వ్యక్తితో ఆత్మీయబంధం బలపడుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ రోజు శ్రమ ఫలిస్తుంది, వ్యాపారస్తులకు సామాన్యం. రావలసిన ధనం వాయిదాపడుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు వస్త్ర వ్యాపారులు శ్రేయస్కరం. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. జీవిత భాగస్వామి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం ఆందోళన కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు దంపతుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శాస్త్ర సంబంధమన విషయాలు ఆసక్తిని చూపుతాయి. క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహన చోదకులకు మరమ్మతులు, జరినామాలు తప్పవు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. జీవిత భాగస్వామి వైఖరిలో మార్పు గమనిస్తారు. ప్రముఖుల నుంచి బహుమతులు అందుకుంటారు. మీ సంతానం కదలికలను గమనించండి ఉద్యోగ స్త్రీలకు వాహన సౌఖ్యం వంటి శుభపరిణామాలు ఎదురవుతాయి. బంధువుల రాకతో ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఓర్పు, నేర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతాయి. రవాణా, ప్రణాళికలు, బోధన ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. నమ్మిన వ్యక్తులు మోసగించే అవకాశం ఉంది. జాగ్రత్తగా గమనించండి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. గృహం కొనుగోలు చేయు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఊహించని ఖర్చులు అధికం. సోదరీ, సోదరులతో మెళకువ వహిస్తారు. నూతన దంపతులకు సంతానం కలుగు సూచనలు కలవు. పెద్దలుగా బాధ్యతలు నిర్వహిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు మధ్యవర్తిత్వం వహించుట వల్ల ఇబ్బందులు తప్పవు. కిరాణా వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు లాభదాయకం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ రోజు ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మొండిబాకీలు వసూలు అవుతాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారడం విశేషం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.