today astrology: 07 జులై 2020 మంగళవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Jul 7, 2020, 6:58 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శుభకార్యాల్లో పాల్గొటాంరు. సంతృప్తి లభిస్తుంది.  దూర ప్రయాణాలకై ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సజ్జన సాంగత్యం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.


 డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) :  వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఉంటుంది. కొంత ఒత్తిడి ఏర్పడుతుంది.  మానసిక ప్రశాంతతను కోల్పోతారు. జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగ ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :  శుభకార్యాల్లో పాల్గొటాంరు. సంతృప్తి లభిస్తుంది.  దూర ప్రయాణాలకై ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సజ్జన సాంగత్యం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) :  మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని ఇబ్బందులు జరుగుతాయి. అనుకోని ఖర్చులు పెడతారు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. బియ్యం, తెల్లని వస్త్రాలు, కందిపప్పు, నూనె దానం చేయడం,

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) :  సామాజిక అనుబంధాల్లో అనుకూలతలు ఉంటాయి. భాగస్వామ్య అనుబంధాలు వృద్ధి చెందుతాయి. నూతన పరిచయాల వల్ల సంతోషం ఏర్పడుతుంది. పదిమందిలో పలుకుబడి పెరుగుతుంది.  వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :  పోటీల్లో ఒత్తిడితో గెలుపు సాధిస్తారు. శతృవులపై శ్రమతో విజయం ఉంటుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. ఔషధ సేవనం తప్పనిసరి చేయాలి. చేసే అన్ని పనుల్లో ఒత్తిడి అధికంగా ఏర్పడుతుంది. జాగ్రత్త అవసరం. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  సంతానం వల్ల సంతోషం ఉండదు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పరిపాలన సమర్ధత కలిగి ఉంటారు. అధికారంపై దృష్టి ఉంటుంది. ఉన్నత విద్యలపై దృష్టి ఏర్పడుతుంది.   కళలపై ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :  మాతృసౌఖ్యానికి కొంత ఆటంకం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయ పాలన మంచిది. రోగనిరోధకశక్తి తగ్గుతుంది. బంధువులతో మనస్పర్ధలకు అవకాశం. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  రచనలపై ఆసక్తి పెరుగుతుంది. తల్లి తరుఫు బంధువుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో సంతోషం లభిస్తుంది. ప్రచార, ప్రసార సాధనాలు అభివృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) :  మాటల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో అననుకూలతలు ఏర్పడతాయి. నిల్వధనం కోల్పోయే అవకాశం. జాగ్రత్తలు అవసరం. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) :  శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మొండితనంతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. చక్కటి ప్రణాళికలను ఏర్పాటు చేస్తారు. నిత్యావసర విషయాలపై దృష్టి పెడతారు. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతి లోపం కనిపిస్తుంది. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఇతరులపై ఆధారపడతారు. కళలపై ఆసక్తి ఉంటుంది. సంపాదనలో దురాశ పెరుగుతుంది. స్త్రీల ద్వారా ఆదాయం వస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది. 

click me!