ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి కుటుంబంలోని మహిళల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సామాజిక, సేవా సంస్థలకు ఇతోదిక సహాయం అందజేస్తారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. వస్తులాభ సూచన ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లభించే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి ముఖ్యమైన విషయాలను గ్రహించి లబ్ది పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ రోజు ఉద్యోగంలో ఏర్పడిన చికాకులు సమసిపోతాయి. గతంలో పొదుపు చేసిన ధనం ఇప్పుడు ఉపయోగపడుతుంది. కుటుంబంలోని మహిళల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సామాజిక, సేవా సంస్థలకు ఇతోదిక సహాయం అందజేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు సన్నిహిత వర్గం మీద నమ్మకాన్ని, గుడ్‌విల్‌ను మరింత బలపరచుకుంటారు. సంతానం కోసం అధికంగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ సూచన ఉంది. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ప్రతి విషయంలోనూ ఎంతో కొంత స్వంత లాభం పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరే బాటలో మీ ప్రమేయం లేకుండానే పయనిస్తారు. కోర్టు వివాదాలు అనుకూలంగా ఉంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ రోజు స్థిరాస్తి, స్థలాలు, భూములు కొనుగోలు వ్యవహారాలు పురోభివృద్ధిలో ఉంటాయి. తనఖా వస్తువులను విడిపిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వల్ప అనారోగ్య సూచన ఉంది. గోపూజ చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఉన్నతాధికారులతో సంబంధాలను బలపరచుకుంటారు. అనేక విషయాలలో అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు కుటుంబ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి. స్నేహితులకు మీ వంతు సహాయసహకారాలు అందజేస్తారు.సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు పొదుపుపై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యా విషయాలకు నంబంధించిన కృషి ఫలిస్తుంది. జీవితభాగస్వామికి విలువైన బహుమతులు అందజేసి ఆశ్చర్యపరుస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ రోజు వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నామినేటేడ్ పదవులు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. బుణాలు తీరుస్తారు.ప్రజా సంబంధాలు బాగుంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ రోజు సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఇనుమడిస్తాయి. మీ వైరివర్గం చేసే ప్రచారాలు ఏమాత్రం ప్రభావం చూపవు. నెలకు ఇద్దరికి అన్నదానం చేయండి. విదేశీయానం వ్యవహారాలు సానుకూలమవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఎదురుచూడని అవకాశాలను నేర్పుగా ఉపయోగించుకుని లబ్ది పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఏర్పడిన ఒడిదొడుకులు తొలగిపోతాయి. ఇంటర్వులలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.