today astrology: 25మే 2020 సోమవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published May 25, 2020, 6:59 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు ఎదురు పడుతాయి. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. హోస్పిటల్స్ వెళ్ళే అవసరం రావోచ్చు. తొందరపాటు పనికిరాదు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయ్. లాభాలు ఉన్న దుర్వినియోగం అవుతాయి.


ఎస్. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) :  వీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. తొందరపాటు పనికి రాదు.  విధ్యార్తులకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. కొంత ఒత్తిడి ఉన్న అనంతరం సంతోషం లభిస్తుంది.  పెద్దలు గురువులతో అనుభందాలు వలపడుతాయి. గురువులతో అనుకూలత యేర్పడుతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :  ఊహించని ఇబ్బందులు ఎదురు పడుతాయి. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. హోస్పిటల్స్ వెళ్ళే అవసరం రావోచ్చు. తొందరపాటు పనికిరాదు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయ్. లాభాలు ఉన్న దుర్వినియోగం అవుతాయి.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక  అనుభందాలు పెరిగే సూచనలు. నూతన పరిచయస్తులతో అప్రమత్తంగా ఉండడం మంచిది.  భాగస్వామ్య అనుభందాలు విస్తరించే అవకాశం. పెద్దవారితో పరిచయాలు పెరిగే అవకాశం. ఆచ్చి తూచి అడుగులు వేయాలి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీల్లో గెలుపుకు ప్రయత్నం చేస్తారు. ఋణ సంభంద ఆలోచనలు పెరుగుతాయి. పెద్దవారితో పోటీ పెరిగే అవకాశం. రోఘానిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుల వారు దగ్గరికి రావడానికి ఆలోచిస్తారు. శ్రమకు తగిన ఫలితం కోసం ఆలోచిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సృజనాత్మకత పెరుగుతుంది. చిత్త చాంచల్యం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రణాళిక బద్ద జీవితం కోసం ఆలోచిస్తారు. సంతాన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాలు ఒత్తిడిని కలిగిస్తాయి. గృహనిర్మాణ పనులలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం. మాతృ సౌకర్యం తక్కువ అయ్యే సూచనలు. విద్యార్తులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆహారం తీసుకునే విశయంలో కొంత తొందరపాటు పనికి రాదు.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కమునికేషన్స్ విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అవసరం అవుతాయి. పెద్దలతో సమయం గడిపే అవకాశం. రచనలంటే ఆసక్తి పెరుగుతుంది. విద్యార్తులకు అనుకూల సమయం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంభంలో అనుకూలత పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. పెద్దలతో మాట మాట కలుపుతారు. నిల్వ ధనం పెంచుకునే ఆలోచనలు చేస్తారు. కుటుంబ అవసరాలు తీరుతాయి. కుటుంబంతో అనుభందం పెరుగుతుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) :  శారీరక శ్రమ పెరుగుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణ జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం  లభిస్తుంది.  పెద్దలతో అనుభందాలు పెరుగుతాయి.  సంతృప్తి లభిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) :  విశ్రాంతి కోసం ఆలోచిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. ఆధాత్మిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో సంతృప్తి లభిస్తుంది. దానధర్మాలకోసం అధిక దానం వెచ్చిస్తారు. దేవాలయాలు విద్యార్తులకు పుస్కకాలు, అవసర వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అన్ని పనులలో లాభాలు సాధించే ప్రయత్నం చేస్తారు.  పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలకోసం ఆలోచనలు పెరుగుతాయి. లాభాలు సద్వినియోగం అవుతాయి. పొట్ట సంభంద నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :  సంఘంలో గౌరవం కోసం పోరాటం చేస్తారు. గౌరవ హానిని తట్టుకోలేరు. కీర్తి ప్రతిస్టాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో పెద్దవారితో తనకన్నా ఉన్నతులతో ఆచి తూచి అడుగులు వేయాలి. తొందరపాటు పనికి రాదు.

click me!