today astrology: 27 జూన్ 2020 శనివారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Jun 27, 2020, 7:09 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మాటల్లో తొందపాటు పనికిరాదు. ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబ సంబంధాలు నిలుపుకునే ప్రయత్నం అవసరం. మధ్యవర్తిత్వాలు పనికిరావు. నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు కనబడుతాయి. పనుల్లో తొందరపాటు పనికిరాదు.


డా. ఎస్.ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అధికారుల సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. విద్యార్థులకు కొంత శ్రమ అధికం అవుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత పెరుగుతుంది.

Latest Videos

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మాటల్లో తొందపాటు పనికిరాదు. ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబ సంబంధాలు నిలుపుకునే ప్రయత్నం అవసరం. మధ్యవర్తిత్వాలు పనికిరావు. నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు కనబడుతాయి. పనుల్లో తొందరపాటు పనికిరాదు.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అధికారులకు ఉద్యోగ మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రమకు తగిన ఫలితంకోసం ఎదురు చూస్తారు. సమయానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. చక్కని ప్రయత్నం చేస్తారు. ఆశయాలు నెరవేరుతాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. తొందరపాటు పనికిరాదు. విశ్రాంతికై ఆలోచన చేస్తారు. తరులపై ఆధారపడతారు. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. శారీరక సౌఖ్యం తగ్గుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అన్ని రకాల ఆదాయాలపై ఆలోచన పెరుగుతుంది. వచ్చిన లాభాలు సద్వినియోగం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. ఉపాసన చేస్తారు. రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలపై ఆలోచిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శారీరక బలం అధికం అవుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ప్రయాణాలు చేస్తారు.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పరిశోధకులకు కొంత ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయలేరు. విద్యవల్ల కొంత గౌరవం పెరిగినప్పటికీ దానిని దుర్వినియోగం చేస్తారు. శాస్త్రంపై పట్టు పెంచుకుంటారు. దూరదృష్టి ఏర్పడుతుంది. శాసనకర్తలు అవుతారు. తాము చెప్పినది వినాలంటారు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వైద్యశాలల సందర్శనం చేస్తారు. పరామర్శలు ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు. తొందరపాటు పనికిరాదు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాల్లో కొంత అసౌకర్యం పెరుగుతుంది. భాగస్వాములతో ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.నూతన పరిచయస్తుల వల్ల మోసం జరిగే సూచనలు ఉన్నాయి. పదిమందిలో గౌరవం కోసం ఆరాటపడతారు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు అవకాశాలు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మానసిక ఒత్తిడిని తట్టుకోవాలి. అనుకున్న పనులు పనులు పూర్తి చేయడంలో ప్రణాళికలు అవసరం అవుతాయి. సంతాన సంబంధ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. పరిపాలన ఒత్తిడి అధికం అవుతుంది. క్రియేటివిటీ తగ్గే సూచనలున్నాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాలపై ఆలోచన చేస్తారు. వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో తొందరపాటు పనికిరాదు. ప్రమాదాలకు అవకాశం. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. కంటి సంబంధ లోపాలు బయటపడే సూచనలు.

click me!