today astrology: 24 జులై 2020 శుక్రవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Jul 24, 2020, 7:10 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ప్రతిభా పాటవాలు, నేర్పుతో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులు సహకారం అందజేస్తారు. ముఖ్యమైన వ్యక్తుల సహకారం అందుతుంది.  చర్చలు ఫలవంతంగా సాగుతాయి.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఉమ్మడి కార్యకలాపాలు, వ్యాపారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. బదిలీకి చేసే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవసరానికి మించి ధనం అధికంగా ఖర్చు చేస్తారు. విదేశీ వస్తువులు ఆకర్షిస్తారు. ప్రారంభించిన వ్యవహారాలు, చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు బంధువులు, స్నేహితులతో సంప్రదింపులు జరుపుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు నేడు అమలు చేస్తారు. సంతానం వల్ల మీ పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ప్రతిభా పాటవాలు, నేర్పుతో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులు సహకారం అందజేస్తారు. ముఖ్యమైన వ్యక్తుల సహకారం అందుతుంది.  చర్చలు ఫలవంతంగా సాగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సహోదర వర్గంతో ఏర్పడిన విబేధాలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అవసరమైన వసతులు ఏర్పరుచుకుంటారు.  ఇంటర్వ్యూల గురించి సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనులు, ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు వ్యాపార అంశాలపై దృష్టిసారిస్తారు. ముఖ్యమైన వస్తువులు సకాలంలో కనిపించకపోవడంతో కలవరానికి గురవుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువులతో ఏర్పడిన విభేదాలు, మనస్పర్ధలు తొలగిపోతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు  మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమమై ఊరట చెందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. పుస్తకాలు, గ్రంథపఠనంపై ఆసక్తి పెరుగుతుంది. కొనుగోలు, అమ్మకాలు సాగిస్తారు.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు  సహోద్యోగులు, ఆప్తులు అపార్థం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆటంకాలు, ఒడిదొడుకులు మాత్రం ఉండవు. మీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారితో ముఖాముఖి చర్చలు సాగిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. తొందరపడి నోరుజారడం మంచిది కాదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. స్థిరాస్తి కొనుగోలు అంశాలు సానుకూలమవుతాయి. దైనందిన కార్యక్రమాలలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మనోధైర్యాన్ని కలిగి ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారదశకు చేరుకొంటాయి. కీలకమైన పత్రాలు చేతికందుతాయి. రాజకీయ నేతలతో సంబంధాలు బలపడతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలమవుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు  మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. రవాణా సమాచార సంబంధిత ఆధునిక సామాగ్రిని ఏర్పరచుకుంటారు. ఉద్యోగ పరంగా స్థానం సుస్థిరపరుచుకుంటారు. శ్రేయస్సును కలిగించే శుభవార్తను వింటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు జీవితభాగస్వామి సలహాలను పాటిస్తారు. వాహనయోగం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బిల్లు, బాకీలు వసూలవుతాయి. ఆశించిన మేర చేపట్టిన పనులలో ఫలితాలను సాధిస్తారు. ఉన్నతాధికారుల మెప్పును పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

click me!