ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వృత్తి ఉద్యోగాదుల్లో తొందరపాటు పనికిరాదు. అధికారులతో అనుకూలత పెంచుకోవాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కీర్తి ప్రతిష్టలు గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపాటు పనికిరాదు.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : లాభాలు సద్వినియోగం అవుతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమిష్టి ఆదాయం లభిస్తుంది. ఆదర్శవంతమైన జీవితం గడుపుతారు. అనుకున్న పనులు పూర్తి చేసే ప్రయత్నం అధికంగా చేస్తారు. అన్ని పనుల్లో ఆనందం కలుగుతుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో తొందరపాటు పనికిరాదు. అధికారులతో అనుకూలత పెంచుకోవాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కీర్తి ప్రతిష్టలు గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపాటు పనికిరాదు.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విద్యార్థులకు అనుకూలమైన సమయం. విద్యార్జనదిశ వైపు ఆశలు పెంచుకుంటారు. పరిశోధకులు తమ ప్రయత్నాలు అటువైపు చేస్తారు. వీరికి అనుకూలమైన సమయం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మొత్తంపై అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అనుకోని ఖర్చులు చేస్తారు. సోదర వర్గీయులతో కొంత అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని ప్రమాదాలకు అవకాశం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సామాజిక అనుబంధాలు సంతోషాన్నిస్తాయి. భాగస్వాములతో కొంత జాగ్రత్త అవసరం. నూతన పరిచయస్తులతో మోసపోయే అవకాశం. అందరినీ నమ్మకుండా ఉండడం మంచిది. సంఘంలో గౌరవం పెంచుకోవడం కోసం ఆలోచన చేస్తారు.
కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనిని మొండితనంతో సాధిస్తారు. పోటీలలో గెలుపును సాధిస్తారు. పోటీలలో గెలుపుకోసం ఆలోచిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఔషధ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంతాన సమస్యలు అధికం అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రణాళికా బద్ధమైన జీవితం గడుపుతారు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సౌకర్యాల వలన ఒత్తిడి పెరుగుతుంది. సౌకర్యాల కోసం ఆలోచిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అనుకూలవంతమైన ప్రయాణాలు చేస్తారు. సోదరవర్గీయుల అనుకూలత పెరుగుతుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కమ్యూనికేషన్స్ వల్ల అనుకూలత పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత పెరుగుతుంది. సోదర వర్గీయుల వలన సహాయ సహకారాలు లాభిస్తాయి. అనుకూలత బాగా పెరుగుతాయి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వాగ్దానాలు నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కుటుంబం సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. వాక్ చాతుర్యం తక్కువౌవుతుంది. నెమ్మదిగా మాట్లాడాలి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శారీరక శ్రమ అధికం అవుతుంది. ఎక్కువ శ్రమకు తక్కువ ఫలితాలు వస్తాయి. పనులలో తొందరపాటు పనికిరాదు. పట్టుదలతో కార్యాచరణ పూర్తి చేస్తారు. ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే సూచనలు. శరీరం జాగ్రత్తగా కాపాడుకోవాలి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలలో ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. పాదాలనొప్పులు పెరుగుతాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. పరామర్శలకు అవకాశం పెరుగుతుంది. తొందరపాటు పనికిరాదు.